Stundents Missing: విద్యార్థులు (Students) అల్లరి చేసినా.. మార్కులు తక్కువ వచ్చినా.. మాట వినడం లేదన్నా.. ఆ క్లాస్ ఉపాధ్యాయులు (Teachers) మందలిస్తుంటారు. మరి కొందరైతే కర్రలకు పని చేబుతారు. ఇలా చిన్న చిన్న కారణాలకే కొంతమంది టీచర్లు ఆవేశానికి లోనై విద్యార్థులు చితకబాదిన సంఘటనలు ఎన్నో చూశాం.. అలాంటి వీడియో వైరల్ (Viral Video) గామారండం.. లేదా తమ బిడ్డలను అంతలా కొట్టారేంటి అని విద్యార్థులు వెళ్లి స్కూళ్ల దగ్గర ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో చూశాం.. కానీ వాటికి భిన్నమైన ఘటన గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి (Mangalagiri)లో చోటు చేసుకుంది. స్కూళు కు వెళ్లిన ఓ నలుగురు విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. ఎప్పటిలానే సాయంత్రం ఇంటికి రావాల్సిన విద్యార్థులు రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్కూళుకు వెళ్లి ఎంక్వైరీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుసుకున్నారు. కానీ మరి ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందో అని భయంతో పోలీసులను ఆశ్రయించారు.. దీంతో ఏం జరిగింది అని ఆరా తీస్తే.. నలుగురు విద్యార్ధులను స్కూల్ టీచరు మందలించినట్టు తెలుసింది..
ఇంతకీ ఏం జరిగిదంటే..? నలుగురు విద్యార్థులు క్లాస్ లు ఎగ్గొట్టి.. ఇంటిలో వాళ్లకు చెప్పకుండా సినిమా (Movie)కి వెళ్లారు. విషయం టీచర్లకు తెలియడంతో.. క్లాస్ లోనే అందరి విద్యార్థుల ముందే నలుగురు విద్యార్థులను టీచర్స్ మందలించారు.. మళ్లీ క్లాస్ లోకి అనుమతించాలన్నా..? క్లాస్ లు వినాలి అన్నా..? తల్లిదండ్రులను మరుచటి రోజు తీసుకురావలని కండిషన్ పెట్టారు. అలా టీచర్లు చెప్పడంతో క్లాస్ రూం నుంచి బయటకు వెళ్లిన ఆ విద్యార్థులు.. ఇంటికి వెళ్లలేదు.. ఇంటికి వెళితే అమ్మానాన్న తిడతారు అనే భయంతో ఎటో వెళ్లిపోయారు.
ఇదీ చదవండి : ఛీ వీడు మనిషేనా..? పెన్ను.. పెన్సిల్ ఆశ చూపించి పాడుపని..
ఒక రోజంతా వారు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. వారు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళగిరి టిప్పర్ల బజార్ లో ఉన్న మున్సిఫల్ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు బడికి వెళ్ళి తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజీవ్ గృహకల్పలో నివాస ముండే నలుగురు విద్యార్థులు వెంకట్, ప్రభు దేవా, సంతోష్, వెంకీ ఎప్పటిలాగే నిన్న స్కూల్ కు వచ్చారు. స్కూల్ నుండి ఎవరికి చెప్పకుండా అఖండ సినిమాకి వెళ్ళారు. సినిమా అయిన తర్వాత తిరిగి స్కూల్ కు వచ్చారు. సినిమాకి వెళ్ళిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి తల్లిదండ్రులను పిలుచుకొని రావాలని ఇంటికి పంపారు.
ఇదీ చదవండి :నా పైన రెండు సీబీఐ కేసులే.. అధినేతపై వందల కేసులు.. లోక్ సభలో వైసీపీ ఎంపీల డైలాగ్ వార్
దీంతో స్కూలు నుండి బయలు దేరిన విద్యార్థులు ఇంటికి వెళ్ళలేదు. రాత్రి వరకూ వేచి చూసిన తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
( Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Gunturu, Mangalagiri, Student, Students