టీనేజీలో అమ్మాయిలు-అబ్బాయల మధ్య ఆకర్షణ, ప్రేమ చాలా సహజం. కాలేజీలో మొదలైన లవ్ స్టోరీలు మ్యారేజ్ వరకు వెళ్లడం చాలా అరుదు అనే చెప్పాలి. కొన్ని జంటలు పెద్దలు ఒప్పించి ఒకటవుతారు. కొందరు ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకోవడమే కాకుండా.. ఏకంగా క్లాస్ రూమ్ లోనే పెళ్లిచేసుకుందో జంట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులు పెళ్లిచేసుకోవడం కలకలం సృష్టించింది.
క్లాస్ రూములోనే ఓ విద్యార్థి విద్యార్థినినీ మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మరో విద్యార్థిని పెద్దగా వ్యవహరించడమే కాదు వీడియో కూడా తీసింది. నవంబర్ 17న పెళ్లి జరగ్గా.. వీడియో వైరల్‌గా మారడంతో విషయం బయటికొచ్చింది. విషయం కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లడంతో ఇద్దరికీ టీసీ ఇచ్చి పంపేశారు. వీరికి సహకరించిన విద్యార్థిని పైనా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యార్థులు పెళ్లి చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh