లెక్చరర్‌పై విద్యార్థుల దాడి.. మంగళగిరిలో ఉద్రిక్తత

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్‌పైనా విద్యార్థులు దాడికి యత్నించినట్లు సమాచారం.

news18-telugu
Updated: October 1, 2019, 10:20 PM IST
లెక్చరర్‌పై విద్యార్థుల దాడి.. మంగళగిరిలో ఉద్రిక్తత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌పై విద్యార్థులు దాడి చేశారు. ఓ విద్యార్థిని లెక్చరర్ మందలించాడన్న కోపంతో దాడికి పాల్పడ్డారు స్టూడెంట్స్. అడ్డొచ్చిన ప్రిన్సిపాల్‌ను కూడా చితకబాదారు. ప్రిన్సిపాల్ కారును ధ్వంసం చేసి రచ్చ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్‌పైనా విద్యార్థులు దాడికి యత్నించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు పలువురు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి చెదరొట్టారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విద్యార్థులు డ్రగ్స్ సేవించినట్లుగా భావిస్తున్న పోలీులు.. వారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు