హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru Disease: ఏలూరులో వింత వ్యాధి... 140 మందికి అస్వస్థత... సీఎం జగన్ ఆరా..

Eluru Disease: ఏలూరులో వింత వ్యాధి... 140 మందికి అస్వస్థత... సీఎం జగన్ ఆరా..

ఆస్పత్రిలో బాధితును పరామర్శిస్తున్న మంత్రి ఆళ్ల నాని

ఆస్పత్రిలో బాధితును పరామర్శిస్తున్న మంత్రి ఆళ్ల నాని

Eluru Strange Disease: ఏలూరులో ఏం జరుగుతోంది? పిల్లలకు సోకుతున్న ఆ వింత వ్యాధి ఏంటి? డాక్టర్లు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏం చెబుతోంది?

  Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా... కేంద్రమైన ఏలూరులో... 140 మంది చిన్నారులు అస్వస్థత చెందడంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్‌కు వివరించారు. దీనిపై జగన్ ఎక్కడా రాజీ పడొద్దని చెప్పినట్లు తెలిసింది. జరిగిన దానికి వెంటనే స్పందించి, బాధితులకు అండగా నిలిచి... వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్‌ మెచ్చుకున్నారు. రాత‍్రంతా మెలకువగా ఉండి... గవర్నమెంట్‌ ఆస్పత్రిలో బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరు పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

  25 మంది డిశ్చార్జి:

  ప్రస్తుతం 140 మంది పిల్లల్లో 25 మందిని డిశ్చార్జి చేశారు. మిగతా వారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. మరేం ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఐతే... అసలేం జరిగింది, పిల్లలకు వస్తున్న అనారోగ్య సమస్య ఏంటన్నది ఇంకా తేలలేదు. అది తెలుసుకునేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.

  ఇలా మొదలైంది:

  ముందుగా ఏలూరు వన్ టౌన్ లోని దక్షిణ వీధిలో కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. ఆ తర్వాత శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, తాపీమేస్త్రీ కాలనీ, అరుంధతిపేట ప్రాంతాల్లోనూ పిల్లలు పడిపోసాగారు. ఒక్కసారిగా కలకలం రేగింది. అంతా ఆందోళన చెందారు. వెంటవెంటనే ఆంబులెన్సులు వచ్చి బాధితులను ఆస్పత్రులకు తరలించాయి. అస్వస్థత చెందిన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండగా... కొందరు పురుషులు, మహిళలు కుూడా ఉన్నారు. కొందరికి మూర్చ, కొందరికి వాంతులు, నోట్లోంచీ నురగ రావడం వంటి లక్షణాలు కనిపించినట్లు డాక్టర్లు తెలిపారు.

  అసలేం జరిగింది..?

  ఒకేసారి వందమందికి పైగా కళ్లుతిరిగి పడిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణమేంటో అటు అధికారులు గానీ.. ఇటు డాక్టర్లుగానీ చెప్పలేకపోతున్నారు. ఐతే నగరంలో సరఫరా అవుతున్న తాగునీరే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా నీరు రంగుమారి వస్తోందని ఆరోపిస్తున్నారు. బాధితుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు వాటిని ల్యాబ్ కు పంపారు. స్థానికంగా సరఫరా అవుతున్న మంచినీటిని కూడా పరిశీలిస్తున్నారు.

  స్పందించిన ప్రభుత్వం

  ఘటన గురించి తెలిసిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఘటనాస్థలికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామన్న మంత్రి.. విజయవాడలోనూ ప్రత్యేక వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు. విజయవాడ జనరల్‌ ఆసుపత్రి నుంచి పిల్లల వైద్యులు, జనరల్‌ ఫిజీషియన్‌, ఇతర వైద్యులు హుటాహుటిన ఏలూరు వెళ్లారు. ఇప్పటివరకు 25 మంది డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.

  ఇది కూడా చదవండి:India Covid 19: ఇండియాలో 1.40 లక్షలు దాటిన కరోనా మరణాలు... 4 రాష్ట్రాల్లో జోరు

  ఒక్కొక్కరు క్రమంగా కళ్లు తిరిగి పడిపోతుండటంతో గ్యాస్ లీకైందేమోనని ఆందోళన చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే తాను కూడా కళ్లుతిరిగి పడిపోయినట్లు ఓ బాధిత బాలిక వివరించింది. ఘటన తర్వాత ఏలూరు నగర వ్యాప్తంగా కలకలం రేగడంతో ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Ap cm jagan, AP News, Eluru

  ఉత్తమ కథలు