తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి అధికారులు కల్పించుకొని ఇతర ప్రాంతాల వారికి శ్రీవారి దర్శనాలను నిలిపివేయాలని టీడీపీ నేత, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. కరోనా ఉద్రిక్తత తగ్గేవరకు స్థానికులకు మాత్రమే దర్శనాలు కల్పిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలవారి వలన కరోనా వస్తోందని స్థానిక ప్రజల భయోందోళనకు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు తిరుపతిలో జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని అన్నారు. తిరుమలలో సైతం స్థానికులకు, ఉద్యోగస్తులకు, గుడిలో పూజారులకు, కరోనా సోకిందని గుర్తు చేశారు.
తిరుమలకు వచ్చే భక్తులందరికీ కరోనా టెస్టులు చేయించే వ్యవస్థ మన దగ్గర లేనందున వారి దర్శనాలను తక్షణం రద్దు చేసి తిరుమల, తిరుపతి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వీధి వీధికి కరోనా రెడ్ జోన్స్ ప్రకటిస్తున్నారని... ఇంట్లో నుండి బయట రావాలంటే తిరుపతి ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. తిరుమల వసతి గృహాలు, తిరుపతిలోని హోటళ్లలో ఇతర ప్రాంతాలు వారు చేయడం వలన, నగరంలో విచ్చలవిడిగా తిరగడం వలన కరోనా తీవ్రత పెరిగిందని నరసింహ యాదవ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala news, Tirupati