జగన్ తో స్టీఫెన్ రవీంద్ర భేటీ... ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యే అవకాశం...?

తెలంగాణ కేడర్ లో హైదరబాద్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్టీఫెన్, ఎన్నికల సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరిపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా ఉన్నారు.

news18-telugu
Updated: May 27, 2019, 7:02 PM IST
జగన్ తో స్టీఫెన్ రవీంద్ర భేటీ... ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యే అవకాశం...?
కాబోయే సీఎం జగన్‌ను కలిసేందుకు వెళుతున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర
news18-telugu
Updated: May 27, 2019, 7:02 PM IST
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్. జగన్మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు పలువురు అధికారులు క్యూ కడుతున్నారు. కాగా తెలంగాణ కేడర్ కు చెందిన హైదరాబాద్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర అమరావతికి చేరుకొని జగన్ తో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో వైఎస్ హయాంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఫ్యాక్షనిజం ఉక్కుపాదం మోపారనే పేరుంది. అలాగే వరంగల్ ఎస్పీగా సైతం నక్సల్స్ తో చర్చల్లో స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో హైదరబాద్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్టీఫెన్, ఎన్నికల సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరిపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా ఉన్నారు.

మరోవైపు స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా నియమించేందుకు ఏపీ నుంచి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వానికి అభ్యర్థన వెళ్లాల్సి ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కేడర్ మార్పుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే ప్రక్రియపై జగన్ తో స్టీఫెన్ రవీంద్ర చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం, అలాగే ఇరురాష్ట్రాలు సంపూర్ణ సహకారంతో కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ముందుగా తాను ఎంపిక చేసుకున్న తెలంగాణ కేడర్ నుంచి సైతం బదిలీ చేయించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

మరోవైపు కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన వారిలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. సీనియర్‌ అధికారులు కృష్ణబాబు, వరప్రసాద్‌, సంధ్యారాణి, లక్ష్మీకాంతం వంటి వారు సైతం భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి అంతా సహకరించాలని ఈ సందర్భంగా అధికారులను జగన్‌ కోరారు. అలాగే ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ సైతం ఏపీ డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...