వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా హెచ్చరించింది. సూట్ కేస్ రెడ్డి , బహుకాలపు జైలు పక్షివి.. రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది.’ అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో జైలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను కూడా తమ పోస్ట్‌లో పొందుపరిచింది. దీంతోపాటు ఇంగ్లీష్‌లో కూడా కొన్ని కామెంట్స్ పోస్ట్ చేసింది. ‘విజయసాయిరెడ్డి అవినీతి జైలు పక్షివని, ఢిల్లీలో బ్రోకర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ మీద నీ ఆరోపణలు నీ క్యారెక్టర్‌కు తగ్గట్టే నీచంగా ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం, హోంమంత్రి కార్యాలయానికి నీ కుతంత్రాలు, రెండు ముఖాల క్యారెక్టర్ తెలుసు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది.’ అంటూ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేసింది.
సూట్ కేస్ రెడ్డి ,
బహుకాలపు జైలు పక్షివి..
రాజకీయాల్లో అక్కుపక్షివి..
వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి..
ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి..
మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే..
మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి.
పాపం పండే టైం వచ్చేసింది. pic.twitter.com/clPlLQGtoW
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 19, 2020
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో దుమ్మెత్తిపోస్తున్నారు. విమర్శల దాడి పెంచారు. అటు కేంద్రానికి కూడా జగన్ ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా కరోనా కిట్ల కొనుగోలులో కమిషన్ కొట్టేశారా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఓ ట్వీట్ చేశారు. ఛత్తీస్ గఢ్‌లో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.337కు కొనుగోలు చేస్తుంటే, ఏపీలో అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇది రాజకీయవర్గాల్లో పెనుదుమారం రేపింది.
"కరోనా కిట్ల"లో కూడా కమీషన్ కొట్టారా?
మన పక్కరాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనాకిట్లను దక్షిణకొరియా నుండి కేవలం ₹337+GSTకి కొన్నారు.
మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారు?
ఈ రెండు కిట్లరేట్లలో తేడాని ప్రజలకు చెప్పి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి. pic.twitter.com/AoF6w9o6xa
— Kanna Lakshmi Narayana (@klnbjp) April 18, 2020
ఈ క్రమంలో కన్నాలక్ష్మీనారాయణ చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయిరెడ్డి విశాఖలో ఆరోపించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వారిద్దరి మధ్య డీల్ కుదిర్చారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Kanna Lakshmi Narayana, Vijayasai reddy, Ysrcp