మరో రెండు రోజులు... వారికి ఏపీ ప్రభుత్వం కీలక సూచన

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ లీక్ బాధితులకు సాయం అందిస్తున్నామని... బాధితులంతా కోలుకుంటున్నారని ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలిపారు.

  • Share this:
    విశాఖలో గ్యాస్ లీకైన ఎల్‌జీ పాలిమర్స్ సమీప గ్రామాలు, కాలనీలకు చెందిన ప్రజలు మరో రెండు రోజుల పాటు ఇళ్లకు దూరంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిస్థితి అదుపులోకి వస్తోందని... ప్రజలు అప్పడే గ్రామాలకు వెళ్లొద్దని నగరంలోనే ఉన్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. గ్యాస్ లీక్ బాధితులకు సాయం అందిస్తున్నామని... బాధితులంతా కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సాంకేతిక నిపుణులతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కమిటీ కూడా పని చేస్తోందని తెలిపారు.

    మరోవైపు గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 500 మందికి పైగా బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. బాధిలుల్లో 140 మంది డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. మరో రెండు రోజులు గ్యాస్ లీక్ పరిసర గ్రామాలకు రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: