రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అనే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్లో స్పష్టం చేసిందని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా, రాష్ట్రానిదా అనే అంశంపై ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అందులో వివరించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని పేర్కొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్టే భావించాలని వెల్లడించింది. ప్రత్యేక హోదా గురించి ప్రతి మీటింగ్లో అడుగుతున్నామని తెలిపింది. హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృతి అంశమని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది.
కొద్దిరోజుల క్రితం పరిఫాలన వికేంద్రీకరణ సహా సీఆర్డీయే రద్దు బిల్లులను ఆమోదిస్తూ ఏపీ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. రాష్ట్ర రాజధానులపై నిర్ణయం రాష్ట్రాలదే అని పేర్కొంది. ఈ అంశంలో కేంద్రం జోక్యం ఉండదని తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన తాజా అఫిడవిట్లో కేంద్రం ప్రస్తావించిన అంశాలను పొందుపర్చింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.