రాజధాని అమరావతిపై యనమల సంచలన కామెంట్లు... వైసీపీకి షాకేనా?

అధికారంలో ఉన్నప్పుడు... రాజధాని అమరావతిపై ఎన్నో ప్లాన్స్ వేసిన టీడీపీ... ప్రతిపక్షంగా మారాక... రాజధానిగా అమరావతే ఉంటుందంటోంది. ఎందుకు?

news18-telugu
Updated: July 18, 2020, 2:04 PM IST
రాజధాని అమరావతిపై యనమల సంచలన కామెంట్లు... వైసీపీకి షాకేనా?
రాజధాని అమరావతిపై యనమల సంచలన కామెంట్లు... వైసీపీకి షాకేనా? (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ అంటుంటే... రాజధానిగా అమరావతే ఉండాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అమరావతి కూడా రాజధానుల్లో ఒకటిగా ఉంటుందని వైసీపీ అంటుంటే... విశాఖను పరిపాలనా రాజధానిగా చెయ్యడానికి వీల్లేదనీ... అమరావతే పరిపాలనా రాజధానిగా ఉండాలని టీడీపీ పట్టుపడుతోంది. వైసీపీ మాత్రం... త్వరలోనే విశాఖకు షిఫ్ అయ్యేలా ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పునర్విభజన చట్టంలో ఏముందో ఆయన గుర్తుచేశారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సులకు తగ్గట్టుగా రాజధాని ఏర్పాటు అవ్వాలని ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుందని వివరించారు. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందన్న ఆయన... రాజధానులు అని లేదు అని గుర్తుచేశారు. ఒకవేళ వైసీపీ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటే... విభజన చట్టంలో సవరణలు అవసరం అన్నారు యనమల. తద్వారా ఈ అంశం కేంద్రం పరిధిలో ఉన్నట్లుగా భావిస్తోంది టీడీపీ.

పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయ యనమల.... వాటిపై విధాన మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బిల్లుల్ని ఆమోదించడమో, వ్యతిరేకించడమో చెయ్యాలన్నారు. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న యనమల... రాష్డ్ట్ర ప్రజలు మాత్రం భిప్రాయం మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐతే... కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతిని కోనసాగించాలని కోరుతున్నా... మిగతా జిల్లాల ప్రజల్లో అభిప్రాయం అలా లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల టీడీపీ నేతల మాటల్ని తాము పట్టించుకునేది లేదంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading