Home /News /andhra-pradesh /

STAR TORTOISE SMUGGLING RACKET BUSTED IN ANDHRA PRADESH NORTH INDIAN MAFIA ILLEGALLY TRANSPORTING TO OTHER COUNTRIES PRN

Andhra Pradesh: ఇంట్లో తాబేళ్లు ఉంటే అదృష్టం వరిస్తుందా..? స్మగ్లింగ్ వెనుక అసలు కథ అదేనా..?

నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా

నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నక్షత్ర తాబేళ్ల (Indian star tortoise) అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా తాబేళ్ల మాఫియా రెచ్చిపోతోంది.

    మన దేశంలో మూఢనమ్మకాలే కొందరికి కాసులు కురిపిస్తాయి. ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాబేళ్లపై కొందరకి కోట్లు కుమ్మరిస్తున్నారు. దీంతో అరుదైన జీవులు స్మగ్లర్ల పాలిట కల్పవృక్షాల్లా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా తాబేళ్ల మాఫియా రెచ్చిపోతోంది. దొంగచాటుగా అరుదైన తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలిస్తున్నారు. తాబేళ్లను దళారులు అక్రమంగా రవాణా చేసి లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. సాధారణంగా దేవాలయాలు, అడవుల్లోనూ ఉండాల్సిన నక్షత్ర తాబేళ్లు రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నాయి. అక్కడినుంచి పొరుగు విదేశాలకు స్మగ్లింగ్ చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

    తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బురుగుపూడి చెక్ పోస్ట్ వద్ద వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 16 బ్యాగుల్లో 450 తాబేళ్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. సామర్లకోట నుండి వీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా, బూరుగుపూడి చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు చెప్పారు.



    ఎందుకంత ప్రత్యేకం
    నక్షత్ర తాబేళ్లు ఎక్కువగా ఆకురాల్చే అడవుల్లో పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న అడవుల్లో ఎక్కువశాతం ఆకులరాల్చేవే. ఇక్క డే ఈ తాబేళ్ల సంపద ఎక్కువగా ఉండేది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ఈ జాతి సంపద ఆనవాళ్లను కోల్పోతోంది. అంతరించి పోతున్న వన్యప్రాణుల జాబితాలోకి చేరింది. వాటి విలువ గుర్తించిన అక్రమార్కులు మాత్రం అడవులను జల్లెడ పడుతూ కనిపించిన నక్షత తాబేళ్లను బాక్సుల్లో బంధించేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాఫియాతో ఉన్న లింకులతో అర్ధరాత్రి సమయాల్లో రహస్యంగా సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రతి ఫలంగా లక్షలాది రూపాయలను కూడగట్టుకుంటున్నారు.

    Indian star tortoise, Star turtles, Andhra Pradesh, Indian star tortoise smuggling, turtles smuggling, tortoise smugglers, నక్షత్ర తాబేళ్లు, ఆంధ్రప్రదేశ్, నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా, చైనా, థాయిలాండ్, China, Thailand,
    నక్షత్ర తాబేళ్లతో వ్యాపారం...


    ఉత్తరాదికి రవాణా
    ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు అడవుల్లో ఉన్న నక్షత్ర తాబేళ్లను పట్టుకుని ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా రవాణా చేస్తున్నారు. ఈ తాబేళ్లను ఇళ్లలో పెంచుకుంటే సిరిసంపదలు కలుగుతాయనే సెంటిమెంట్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ. ఈ కారణంగానే అక్కడి ప్రజలు ఈ తాబేళ్లను భారీగా డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటున స్మగ్లర్లు ఒక్కో తాబేలును రూ.50వేల వరకు విక్రయిస్తున్నారని సమాచారం. నిజానిది భూమి మీదున్న వన్యప్రాణుల్లో తాబేలుకు జీవితకాలం చాలా ఎక్కువ. దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న విశ్వాసం ఉత్తరాది వాళ్లలో ఎక్కువ.

    విదేశాల్లోనూ డిమాండ్
    ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న తాబేళ్ల మాఫియా మరో మార్గంలోనూ ఈ నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ దందాను జోరుగా నడిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సరిహద్దుల వరకు అక్రమ మార్గంలో వెళ్లిన తాబేళ్లను ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ నక్షత్ర తాబేళ్లకు చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. ఆయా దేశాల్లో ఫ్రెండ్స్ గానీ, చుట్టాలు గానీ ఇంటికి వచ్చినా లేదా  శుభకార్యాలకు వెళ్లినా నక్షత్ర తాబేలును కానుకగా ఇస్తారు. ఈ సెంటిమెంట్లను ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు అరుదైన తాబేళ్లను దొడ్డిదారిన స్మగ్లింగ్ చేసేస్తున్నారు.

    స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు
    దేశంలో అంతరించిపోతున్న వన్యప్రాణుల్లో నక్షత్ర తాబేళ్లు కూడా ఉన్నాయి. 1972 వన్యప్రాణి సంరక్షణ విభాగం చట్టం ప్రకారం నక్షత్ర తాబేళ్లు నాలుగో షెడ్యూల్‌లో ఉన్నాయి. అడవుల్లో ఉన్న వన్యప్రాణులను మొత్తం ఆరు షెడ్యూళ్లుగా విభజించారు. ఈ తాబేళ్లు ఆలయాలు, అడవుల్లో మాత్రమే ఉండాలి. ఇతరులు ఎవరి వద్ద ఉన్నా నేరమే. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని అటవీ శాఖ అదికారులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Animals, AP Police, East Godavari Dist, Forest, Smuggling

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు