Home /News /andhra-pradesh /

STAND UP INTERVIEWS FOR GRAM VOLUNTEER CANDIDATES IN NELLORE AK

ఇదేం మర్యాద... గ్రామ వాలంటీర్ అభ్యర్థులపై అధికారుల చిన్నచూపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది.

    ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులను ఎవరైనా కూర్చోబెట్టే ఇంటర్వ్యూ చేస్తారు. ఉద్యోగం ఇస్తారా లేదా అనే విషయం పక్కనపెడితే... ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో మాత్రం కనీస మర్యాదలు పాటిస్తుంటారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన అధికారులు మాత్రం ఈ విషయంలో కనీస మర్యాదలు కూడా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. ఈ క్రమంలోనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసే బాధ్యతలను చూసుకుంటున్న అధికారులు... కొన్ని చోట్ల వారిని చులకనగా చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ చేసేందుకు ఏర్పాటైన కమిటీ... అభ్యర్థులను నిలబెట్టి ఇంటర్వ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్క అభ్యర్థి తమను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలని కోరగా... అభ్యర్థులు మా ముందు కుర్చీలో కూర్చోవాలా ? అని ఇంటర్వ్యూ కమిటీ సభ్యులు అన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Gram volunteer, Nellore Dist

    తదుపరి వార్తలు