Home /News /andhra-pradesh /

SSLV D1 EOS 02 MISSION UPDATE SSLV D1 PLACED THE SATELLITES INTO 356 KM 76 KM ELLIPTICAL ORBIT SATELLITES ARE NO LONGER USABLE SK

ISRO: ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం.. ఆ శాటిలైట్స్ ఇక పనికిరావు.. ఇస్రో కీలక ప్రకటన

ఇస్రో sslv d1 రాకెట్ ప్రయోగం

ఇస్రో sslv d1 రాకెట్ ప్రయోగం

sslv-d1: రెండు ఉపగ్రహాలను 356 x 76 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ SSLV-D1 రాకెట్ వాటిని 356 కి.మీ. వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఆ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఇస్రో (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SSLV-D1 ప్రయోగం విఫలమైంది. ఈ మేరకు ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది.  నాలుగు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపుతప్పింది.  రెండు ఉపగ్రహాలను 356 x 76 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ SSLV-D1 రాకెట్ వాటిని 356 కి.మీ. వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఆ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్ ఫెయిల్యూర్ వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తుందని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే SSLV-D2 ప్రయోగాన్ని చేపడతామని తెలిపింది.



    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో .. నూతన చరిత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌(SSLV- డీ1) ను రూపొందించింది. ఆ రాకెట్ ఇవాళ ఉదయం 09.18 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. EOS-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. షార్‌ నుంచి ఇది 83వ ప్రయోగం. SSLV డీ1 సిరీస్‌లో ఇదే మొదటి ప్రయోగం. ఈ రాకెట్ పొడవు34 మీటర్లు. వెడల్పు 2 మీటర్లు. బరువు 120 టన్నుల వరకు ఉంటుంది. గరిష్టంగా 500 కిలోల వరకు బరువును నింగిలోకి తీసుకెళ్లేలా రాకెట్‌ను రూపొందించింది ఇస్రో.



    ఈ రాకెట్ ద్వారా దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ (ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్‌’ను ప్రయోగించారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం ముగిసింది. ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా 350 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. మొదటి దశ 127.5 సెకన్లలో పూర్తయింది. రెండో దశకు 336.9 సెకన్ల సమయం పట్టింది. మూడో దశను 633.3 సెకన్లలో, నాలుగో దశను 742 సెకన్లలో పూర్తి చేశారు. ఆ తర్వాత సిగ్నల్ మిస్సైంది. అప్రమత్తమైన శాస్త్రవేత్తలు సిగ్నల్ కోసం ఎంతో ప్రయత్నించారు. ఐతే SSLV-D1 రాకెట్ ఉపగ్రహాలను వృత్తాకార కక్షలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్షలో ప్రవేశపెట్టడం వల్ల.. ఈ ప్రయోగం విఫలమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, ISRO

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు