కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూల అమ్మకాలను టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంతో స్వామివారి దర్శనం దొరక్క భక్తజనం అల్లాడిపోయారు. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలను శనివారం ఉదయం నుంచి ప్రారంభించింది. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద లడ్డూ ప్రసాదాలు మొదలయ్యాయి. దాదాపు 55 రోజుల తర్వాత లడ్డూ విక్రయాలు మొదలుకావడంతో విషయం తెలుసుకున్న భక్తులు బారులుదీరారు. కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala Temple, Tirupati, Ttd