చరిత్ర సృష్టించిన శ్రీశైలం డ్యాం... ఈ ఏడాదిలో 7వసారి గేట్లు ఎత్తివేత

అయితే ఈ ఏడాది శ్రీశైలం జలాయశం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలో జలాశయం గేట్లు తెరవడం ఇది ఏడవసారి.

news18-telugu
Updated: October 23, 2019, 11:21 AM IST
చరిత్ర సృష్టించిన శ్రీశైలం డ్యాం... ఈ ఏడాదిలో 7వసారి గేట్లు ఎత్తివేత
మరోసారి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేత
news18-telugu
Updated: October 23, 2019, 11:21 AM IST
ఏపీ కర్నూలు జిల్లాలో ఉణ్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రాత్రి మూడు గేట్లు సుమారు 10 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద ఉధృతి మరింత పెరగడంతో ఉదయం ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 215 టీఎంసీల నీరు ఉంది. స్పిల్ వే ద్వారా లక్షా 95వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కుడి ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మరో 68వేల క్యూసెక్కులను వదులుతున్నారు. అయితే ఈ ఏడాది శ్రీశైలం జలాయశం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదిలో జలాశయం గేట్లు తెరవడం ఇది ఏడవసారి. ఎన్నడూ లేని విధంగా డ్యాం గేట్లను ఈ ఏడాది భారీ వర్షాల దృష్ట్యా ఏడుసార్లు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం జరిగింది. భారీ వర్షాలతో డ్యాంకు భారీ వరద కొనసాగుతోంది.First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...