• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • SRISAILAM PROJECT GETTING INFLOW FORM JURALA PROJECT WATER LEVEL INCREASING IN SRISAILAM BS

ఉరకలెత్తుతున్న జూరాల.. కళకళలాడుతున్న శ్రీశైలం..

ఉరకలెత్తుతున్న జూరాల.. కళకళలాడుతున్న శ్రీశైలం..

ప్రతీకాత్మక చిత్రం

Srisailam Project: జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం కళకళలాడుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 1,76,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Share this:
వరద నీరు జూరాల నుంచి జలజలా పారుతూ.. శ్రీశైలానికి చేరింది. ప్రాజెక్టును నిండుకుండలా, కళకళలాడేలా చేసింది. ఎగువన భారీ వర్షాల కారణంగా కర్ణాటక నుంచి వచ్చిన వరద నీరు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలను నింపి దిగువన జూరాలకు పోటెత్తుతోంది. 1.9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.655 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.200 మీటర్లుగా ఉంది. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం కళకళలాడుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 1,76,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గురువారం ఉదయానికి 809.9 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలుగా ఉంది.ఈ వరద మరింతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
First published: