Srisailam Fire Accident: సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి

తెలంగాణ అధికారులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని ఏపీ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: August 21, 2020, 10:16 AM IST
Srisailam Fire Accident: సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు.. అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణకు చెందిన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ జెన్‌కో ప్లాంట్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు సీఎం జగన్. తెలంగాణ అధికారులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని ఏపీ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ్టి శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. ఐతే అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని అధికారులతో అన్నారు జగన్. ఈ క్రమంలోనే శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు.

గురువార రాత్రి 10.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం (తెలంగాణ జెన్‌కో)లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసింందే. మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాలగంగ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విద్కుత్ కేంద్రంలో 19 మంది ఉన్నారు. 10 మందిని క్షేమంగా బయటపడగా.. మరో 9 మంది మాత్రం లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పొగ తగ్గడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దగ్గరుండి సమీక్షిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 21, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading