Srisailam Project: శ్రీశైలం డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం

ప్రస్తుతం క్రస్ట్ గేట్లపై ఓవర్ ఫ్లో అవుతున్నా, గేట్లు పై నుంచి కృష్ణమ్మ దూకుతున్నా కూడా అధికారులు కనీసం చూసుకోలేదు. చివరకు ఆలస్యంగా గమనించి, హడావిడిగా ఒక గేటును పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

news18-telugu
Updated: September 10, 2020, 6:44 PM IST
Srisailam Project: శ్రీశైలం డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం
శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన శ్రీశైలం డ్యామ్ నిర్వహణకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు దాటి నీరు ప్రవహిస్తోంది. సాధారణంగా ప్రాజెక్టులో గేట్ల వరకు వస్తే వెంటనే అధికారులు గేట్లను పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉంటారు. అంటే, నీటి ఒత్తిడి ప్రాజెక్టు మీద పడకుండా ఎగువ నుంచి వచ్చే వాటిని కిందకు వదులుతూ డ్యామ్‌లో ఎంత నీరు ఉంచాలో అంత నీరు ఉంచుతారు. కానీ, ప్రస్తుతం క్రస్ట్ గేట్లపై ఓవర్ ఫ్లో అవుతున్నా, గేట్లు పై నుంచి కృష్ణమ్మ దూకుతున్నా కూడా అధికారులు కనీసం చూసుకోలేదు. చివరకు ఆలస్యంగా గమనించి, హడావిడిగా ఒక గేటును పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక గేటు ఎత్తినా గేట్లపై నుంచి వరద నీరు పారుతోంది.

గతంలో కూడా ఇలాగే గేట్ల పై నుంచి వరద నీరు పారేంద వరకు అధికారులు పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. అయితే, నీటి అలలు మాత్రమే పైకి ఎగిసిపడ్డాయని... గేట్లు ఎత్తడంలో ఎలాంటి వైఫల్యం లేదన్నది అధికారుల వాదన. సకాలంలోనే స్పందించి గేట్లు తెరచినట్లు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 10, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading