Srisailam Dam: శ్రీశైలానికి భారీగా వరద నీరు.. ఎంత వరకు వచ్చాయంటే..

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 868.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీల కాగా. ప్రస్తుతం 136.6026 టీఎంసీల నీళ్లున్నాయని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: August 15, 2020, 8:26 PM IST
Srisailam Dam: శ్రీశైలానికి భారీగా వరద నీరు.. ఎంత వరకు వచ్చాయంటే..
శ్రీశైలం డ్యామ్
  • Share this:
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని డ్యామ్స్ కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 868.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీల కాగా. ప్రస్తుతం 136.6026 టీఎంసీల నీళ్లున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతతం శ్రీశైలం జలాశయానికి 1,25,969 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 40,259 క్యూసెక్కుల ఔట్ ఫ్లోతో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశముంది.

ష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 9.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని.. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading