Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు మళ్లీ జలకళ.. 8 గేట్ల నుంచి నీటి విడుదల

శ్రీశైలం డ్యామ్

ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు.

 • Share this:
  తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు మళ్లీ కళకలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,203 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుండి 1,06,316 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 47,421 క్యూసెక్కులు హుంద్రి నుండి 9,780 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతోంది. మొత్తం 1,63,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

  శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 కాగా.. ప్రస్తుతం 884.900 అడుగుల నీటి మట్టం ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 215.3263 టిఎంసిల నీళ్లు ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు.

  శ్రీశైలం నుంచి వరద నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. జలాశయం నిండినందున 14 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు 2,49,055 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 2,49,055 క్యూసెక్కుల నీటిని పులి చింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. అటు జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published: