SRIKALHASTHI KANAMKARI ART TO BE EXHIBITED AT MODERN GALLERY OF ART DURING REPUBLIC DAY CELEBRATIONS FULL DETAILS HERE PRN TPT
Srikalahasthi Kalamkari: ఢిల్లీకి శ్రీకాళహస్తి కలంకారీ.. చిత్తూరు యువకుడికి ప్రతిభకు గుర్తింపు..
శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు సుధీర్ కి అరుదైన గుర్తింపు
కలంకారీ (Kalamkari Art) లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సుధీర్.. తన నైపుణ్యంతో చిత్తూరు జిల్లా (Chittoor Dsitrict) ఖ్యాతిని ఎర్రకోట (Red Fort) వద్దకు తీసుకెళ్లాడు. సుధీర్ తో పాటు తన మిత్ర బృందం కళంకారీలో ఆరితేరిన వారే. అతని మిత్రబృందం వేసిన కలంకారీ చిత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దిల్లీలో జరిగే మోడరన్ ఆర్ట్ గ్యాలరీకి ఎంపికైంది.
స్వాతంత్య్రం కోసం ఎందరో పోరాట యోధులు అహర్నిశలు శ్రమించి భారత దేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి కలిగించారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన ఎందరో మహాను బావులు, మరెందరో యోధుల త్యాగాన్ని, వారు రగిల్చిన స్ఫూర్తిని పరిమళింపజేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) శ్రీకాళహస్తికి చెందిన సుధీర్. వ్యవసాయ కుటుంబంలో జనమించిన సుధీర్ కు హస్త కళలంటే ఎంతో మక్కువ. దీంతో చిన్ననాటి నుంచే హస్తకళలపై ఆసక్తి చూపాడు. చిన్న చిన్న పెయింటింగ్ వేస్తూ.. కలంకారీలోప్రావిణ్యం పొందేందుకు చిన్ననాటి నుంచే శిక్షణ పొందాడు. ఆలా హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో బ్యాచులర్ ఇన్ విజువల్స్ ఆర్ట్ ను పూర్తి చేసాడు. కలంకారీ హస్తకళలపై ఎంతో ఇష్టం ఉండటంతో మోడరన్ మెలకువలతో కలంకారీ కళాఖండాలకు జీవం పోస్తున్నాడు. తనకున్న ఇష్టం గుర్తించిన ఆయన సతీమణి జామున సైతం కలంకారీ హస్తకళల్లో ప్రావీణ్యం పొందారు.
చిత్తూరు జిల్లా రేణిగుంటలో నివాసం ఉంటున్నాడు సుధీర్. కలంకారీ హస్త కళలకు ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీకాళహస్తిలో నూతన కళాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. అంతేకాక నూతన డిజైన్లతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ కళ ద్వారానే జీవనోపాధిగా ఎంచుకున్నాడు. కలంకారీలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సుధీర్.. తన నైపుణ్యంతో చిత్తూరు జిల్లా ఖ్యాతిని ఎర్రకోట వద్దకు తీసుకెళ్లాడు. సుధీర్ తో పాటు తన మిత్ర బృందం కళంకారీలో ఆరితేరిన వారే. అతని మిత్రబృందం వేసిన కలంకారీ చిత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దిల్లీలో జరిగే మోడరన్ ఆర్ట్ గ్యాలరీకి ఎంపికైంది. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్ పథ్ లో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ 750 మీటర్ల పొడ వుతో భారీ ప్రదర్శనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 500 మంది కళాకారులచే చిత్రీకరించిన చిత్రాలు ఉంచాలని నిర్ణయించింది.
ఈ వేడుకలోకె శ్రీకాళహస్తికి చెందిన సుధీర్ దరఖాస్తు చేసుకున్నారు. 30 మీటర్ల పొడవు కల్గిన కలంకారీ వస్త్రంపై స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైన తెలుగుతేజాలు అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, పింగళివెంకయ్య తదితర దేశభక్తుల చిత్రాలతో పెయిటింగ్ను సిద్ధం చేశారు. ఈ చిత్రం గ్యాలరీలో ప్రదర్శించేందుకు ఆ కమిటీ నుంచి అనుమతి లభించింది. తెలుగు వాడిగా మరో తెలుగు జాతి మహోన్నత వ్యక్తులను గ్యాలరీలో స్మరించుకోవడం గర్వించదగ్గ విషయం. ఇలాంటో ప్రయత్నం చేసిన సుధీర్ అభినందలు తెలపాల్సిందే..!
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.