Home /News /andhra-pradesh /

SRIKAKULAM YCP LEADERS FOCUS ON TELUGU DESAM PARTY SITTING SEATS IN ANDHRA PRADESH NGS VSP

Telugudesam: బీటలు వారుతున్న టీడీపీ కంచుకోట.. ఆ ఎమ్మెల్యే తీరే కారణమా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Telugudesam: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. కొన్ని నియోజకవర్గాలపై అధికార, ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలను ఆయా పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన సీట్లలో వైసీపీ బలం పుంజుకుంటోంది. ఎక్కడంటే..?

ఇంకా చదవండి ...
    P Anand Mohan, News18, Visakhapatnam.

    Telugudesam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీల ఇప్పటి నుంచే దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలు అయిన వైసీపీ (YCP), టీడీపీ (TDP)లకు కొన్ని నియోజకవర్గాలు టార్గెట్ అవుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు ఒక పరిస్థితి.. ఇప్పుడు మరో పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయాలు నడిస్తే.. ఇప్పుడు అక్కడ టీడీపీ బలపడుతోంది. కొన్నినియోజకవర్గాల్లో మాత్రం. పరిస్థితి రివర్స్ లో ఉంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోటలనే వైసీపీ టార్గెట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాగ వేయడం కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తోంది. సీఎం జగన్ (CM Jagan) సైతం పదే పదే తన లక్ష్యం 175 అని చెబుతూనే ఉన్నారు. అది సాధ్యం కావాలంటే గత ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ 23 చోట్ల టీడీపీ నెగ్గింది. అందులో ఇప్పటకి కొందరు టీడీపీ దూరంగా ఉంటాన్నారు.. కొందరు జగన్ కు జై కొట్టారు. ఇంకా టీడీపీలోనే కొసాగుతున్న ఎమ్మెల్యే నియోజకవర్గాలను అధికార వైసీపీ టార్గెట్ చేస్తోంది.. అక్కడ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.

    ఆ దిశగా అడుగులు వేస్తోంది కూడా.. ప్రస్తుతం టీడీపీ కంచుకోటల్లో బలం పెంచుకుంటోంది వైసీపీ. టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ హవా కొన్ని చోట్ల కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కూడా ఒక కారణం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ గా మారినట్టు ప్రచారం ఉంది. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో వైసీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇచ్చాపురం టీడీపీ కంచుకోటగా ముద్ర పడింది. 

    1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…ఇక్కడ టీడీపీ ఓడింది కేవలం ఒక్కసారి మాత్రమే.. అది కూడా 2004లోనే. మళ్ళీ అక్కడ టీడీపీకి ఎదురవ్వలేదు. జగన్ వేవ్ ఉన్న 2019 లో కూడా ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ సీన్ మారింది. పైగా ప్రతిపక్షంలోకి వెళ్ళాక టీడీపీ ఎమ్మెల్యే అశోక్… స్థానికంగా అందుబాటులో ఉండడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఎలాంటి పనులు చేయలేమని చెప్పి…ఆయన ఎక్కువగా విశాఖకే పరిమితమవుతున్నారని సొంత కేడరే చెబుతోంది.

    ఇదీ చదవండి : అసెంబ్లీ ముందుకు మరోసారి మూడు రాజధానుల బిల్లు.. విశాఖ నుంచే పాలన.. మంత్రి ఏమన్నారంటే?

    ఆయన వ్యవహార శైలే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది.. ఇక్కడ వైసీపీ నేత పిరియా సాయిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉండటంతో పనులు చేయిస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఈయనపై ఉంది. అలాగే 2009 ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది…నియోజకవర్గంపై పట్టు ఉంది. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఇలానే ఉంటే.. టీడీపీకి సిట్టింగ్ సీటు పోయే ప్రమాదం ఉంటుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, TDP, Ycp

    తదుపరి వార్తలు