SRIKAKULAM WHY COLD WAR BETWEEN DHARAMANA PRASADA RAO AND DARMANA KRISHNA DAS IN SRIKAKULAM YCP NGS VZM
Brothers Fight: ఇద్దరూ సొంత అన్నదమ్ములు.. ఒకే పార్టీలో ఉన్నారు.. అయినా కోల్డ్ వార్ ఎందుకు?
అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కు కారణం అదేనా?
Brothers Fight: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో రోజు రోజుకూ వర్గ పోరు బయట పడుతోంది. అయితే సొంత పార్టీ నేతల మధ్య విబేధాలు ఉండడం చాలా కామన్.. కానీ ఈ జిల్లాలోమాత్రం.. సొంత అన్నదమ్ముల మధ్య ఫైట నడుస్తోంది. ఒకరి జగన్ తొలి కేబినెట్ లో మంత్రి అయితే.. మరొకరు.. జగన్ రెండో కేబినెట్ లో మంత్రి అయ్యారు.. అయినా ఇప్పుడు ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారని వైసీపీ కేడర్ లో ప్రచారం జరుగుతోంది.
Brothers Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరుతోంది. ఇప్పటికే పలు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని పంచాయితీలు అధిష్టానం వరకు కూడా వెళ్లాయి.. అయినా చాలా చోట్ల విబేధాలు బయట పడుతూనే ఉన్నాయి. సాధారణంగా ఒక పార్టీలో ఉన్న నేతల మధ్య విబేధాలు ఉండడం సహజం.. కానీ సొంత అన్నదమ్ముల మధ్య విబేధాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అయితే ఒక కుటుంబంలో వ్యక్తులు వేర్వే వేర్వ పార్టీల్లో ఉంట గొడవలు తప్పవు. వారు ఎవరో కాదు.. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కు చెందిన ధర్మాన కృష్ణదాస్ (Darmana Krishna Das).. ధర్మాన ప్రసాదరావు (Darmana Prasada Rao). ఇద్దరూ సోదరులే. కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా చేస్తే.. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అన్నను సాగనంపి.. తమ్ముడు ప్రసాదరావును మంత్రిని చేశారు. కృష్ణదాస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కృష్ణదాస్ మంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రసాదరావు.. ఇప్పుడు అన్న కృష్ణదాస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ్ముడు డుమ్మా కొడుతున్నారు.
మంత్రి పదవిలో ఉండగా దాసన్న చుట్టూ ప్రదర్శన చేసింది కేడర్. ప్రసాదరావు మంత్రి కావడంతో ఆ కేడర్ ఇటు టర్న్ తీసుకుంది. కృష్ణదాస్ ఎమ్మెల్యేగా ఉన్న నరసన్నపేట వైసీపీ నేతలు సైతం పనులకోసం ధర్మాన ప్రసాదరావును ఆశ్రయిస్తున్నారు. ఇది అన్నకు అస్సలు రుచించని అంశంగా మారింది. ఆ ఆవేదన నరసన్నపేట వైసీపీ ప్లీనరీలో కృష్ణదాస్ మాటల్లో తన్నుకొచ్చింది.
ద్వితీయ శ్రేణి నాయకుల తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం.. హద్దు మీరితే అధినేత సీఎం జగన్‌కు కంప్లయింట్ చేస్తానని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అయిత పరోక్షంగా సొదరుడి వర్గాన్నే ఆయన టార్గెట్ చేసినట్టు ప్రచారం ఉంది. ప్రస్తుతం కృష్ణదాస్ కామెంట్స్ చుట్టూనే చర్చ జరుగుతోంది. చిన్నా చితక నేతలపై అధినేతకు ఫిర్యాదు చేయాల్సిన పనిలేదని.. ఆయన అనడంతో.. తమ్ముడు ప్రసాదరావునే కృష్ణదాస్ గురి పెట్టినట్టు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలలోపు బ్రదర్స్ మధ్య రాజుకున్న ఈ అగ్గికి ఆజ్యం పోసే అనుచరులు ఉండడంతో పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ప్రస్తుతం నరసన్నపేటలో చాలా మంది వైసీపీ నేతలు.. ప్రసాదరావుకు తెలుసు. మొన్న మంత్రి అయిన తర్వాత ఆ పాత పరిచయాలు మరింత యాక్టివ్ అయ్యాయి. కృష్ణదాస్‌కు తెలియకుండా పనులు చక్కబెట్టడమే సమస్యకు కారణమన్నది పార్టీ వర్గాల మాట. దీంతో వర్గ రాజకీయం బుసలు కొడుతోంది. అది పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఆ మధ్య నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇచ్ఛాపురం, టెక్కలిలో గ్రూపు రాజకీయాలను సెట్ చేసేందుకు అన్నదమ్ములు కలిసి కృషి చేసినా తర్వాత బ్రదర్స్ మధ్యే గ్రూపు ఫైట్ మరో అంకానికి చేరుకుంది. ఈ రెండు వర్గాల మధ్య విబేధాలు హద్దులు దాటడంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఎంట్రీ ఇవ్వక తప్పడం లేదట. దీంతో బొత్స పాల్గొనే సభలకు ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతున్నారనే ప్రచారం కూడా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లే పనిలో ఉన్నాయి. ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. శ్రీకాకుళంలో మాత్రం అన్నదమ్ముల మద్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సమస్య ముదిరి వార్నింగ్‌లు ఇచ్చుకునే వరకు వెళ్లడంతో రేపటి రోజున ఇంకేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.