Home /News /andhra-pradesh /

SRIKAKULAM VIZIANAGARAM YOUNG MAN GET GOLD MEDAL IWF YOUTH WORL CHAMPAIONSHIP IN MEXICO NGS VZM

Champion: అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగు కుర్రాడు.. ప్రపంచ స్థాయి ఛాంపియన్ షిప్ లో గోల్డ్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు..

ప్రపంచ ఛాపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన విజయనగరం యువకుడు

ప్రపంచ ఛాపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన విజయనగరం యువకుడు

Champion: పుట్టింది మారుమూల ప్రాంతమైనా..? తన గ్రామఖ్యాతిని ఖండతరాలు దాటించాడు. ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఎందులోనా తెలుసా..?

    Champion: మట్టిలో మాణిక్యాలు ఉంటాయని చాలా సందర్భాల్లో రుజువైంది. సరైన వసతులు కూడా లేని మారు మూల గ్రామాల్లో పుట్టిన ఎందరో ప్రపంచ ఖ్యాతి సాధిస్తూ.. భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెప రెపలాడేలా చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా (Vizianagaram District) లోని నెల్లిమర్ల మండలం (Nelimarla Mandal) చంద్రం పేట గ్రామానికి చెందిన కుర్రాడు శనాపతి గురునాయుడు (Gurunaidu)
    స్వర్ణ పతకం (Gold Medal) తో మెరిసాడు. అది కూడా ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ విభాగం (IWF Youth World Championship) లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ (Weightlifting) క్రీడాకారులను తీర్చదిద్దడంతో పలు రికార్డులు సాధించాడు. కొండవెలగాడ గ్రామంలో గత కొన్నాళ్లుగా శిక్షణ పొందిన వెయిట్ లిఫ్టర్ శనాపతి గురునాయుడు ( Sanapati Gurunaidu) .. మెక్సికోలో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ ఛాంపియన్​షిప్​ పోటీలో తొలిస్థానంలో నిలిచి అతడు స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు.

    గతంలో కొండ వెలగాడ గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి సహా అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు సాధించి రికార్డులు స్ళష్టించారు.  మెక్సికోలో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ ఛాంపియన్​షిప్​ పోటీలో మొదటి స్థానం సాధించాడు.  ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్ అయిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో  భారత దేశం నుంచి  10 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు.  

    అందులో ఏపీ నుంచి ముగ్గురు పాల్గొన్నారు. వీరిలో 16 ఏళ్ల గురునాయుడు ఒకరు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన బాలుర 55 కేజీల ఈవెంట్‌లో మొత్తం 230 కిలోలు ఎత్తి రెండు స్వర్ణాలు, ఒక వెండి పతకం సాధించాడు. యూత్ వరల్డ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించాడు గురు నాయుడు.

    ఇదీ చదవండి : ఏయూలో గిరిజన జాతర.. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు.. ప్రత్యేకత ఏంటంటే?

    ఈ పోటీల్లో సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్‌ 229 కేజీలతో సెకెండ్ ప్లేస్ సాధించగా.. కజకిస్థాన్‌కు చెందిన్‌ ఉమ్రోవ్‌ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్ లో తొలిసారి బంగారుపతకం నెగ్గిన భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన గురునాయుడ్ని టీమ్ మేనేజ్మెంట్, కోచ్ లు, తోటి క్రీడాకారులు అభినందించారు.

    ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాల్లో టీడీపీలో చేరికలకు ఎందుకంత డిమాండ్.. ఆ నియోజకవర్గంపై ముగ్గురు కర్ఛీఫ్..

    మెక్సికో లో జరిగిన యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బాలుర 55 కిలోల విభాగంలో గురునాయుడు సాధించిన విజయం పట్ల కొండవెలగాడ గ్రామస్తుల నుండి దేశ ప్రముఖుల వరకూ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. జిల్లా కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన గురునాయుడు ను అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి జిల్లాలోని యువతకు గురునాయుడు స్పూర్తి గా నిలుస్తారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ఆకాంక్షించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు