SRIKAKULAM TRIBES IN SRIKAKULAM AND VIZIANAGARAM ARE IN DANGEROUS SITUATIONS AS BEARS ATTACKING ON VILLAGERS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VZM
Bear attacks in AP: ఉత్తరాంధ్రలో టెన్షన్ టెన్షన్.. జనం మీద పడుతున్న ఎలుగుబంట్లు.. కారణం ఇదే..!
ఎలుగు బంటి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram) జిల్లాల్లో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి చేసిన దాడిని మరువకముందే.. తాజాగా అదే ప్రాంతంలో మరో ఎలుగు బంటి సంచారం గుబులు రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram) జిల్లాల్లో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి చేసిన దాడిని మరువకముందే.. తాజాగా అదే ప్రాంతంలో మరో ఎలుగు బంటి సంచారం గుబులు రేపుతోంది. ఇక విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో కూడా ఎలుగు బంటి సంచారంతో గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. 4 రోజుల క్రితమే.. కిడిసింగి వద్ద తోటల్లో ఎలుగుబంటి రైతులపై చేసిన దాడిలో ఒకరి మ్ళతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. తాజాగా పలువ తాడివాడ వద్ద ఇవాళ మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు.
ఇటీవల ఉద్దానంలో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సం ఇప్పటికీ స్థానికుల్లో ఇంకా మెదులాడుతూనే ఉంది. దాడి చేసి ఒకరిని పొట్టన పెట్టుకొని, ఆరుగుర్ని గాయపరచి ఆసుపత్రుల పాలు చేసింది. చివరకు రెస్క్యూ ఆపరేషన్ చేసి విశాఖ జూకు తరలించే క్రమంలో భల్లూకం మృత్యువాత పడింది. అయితే ఆ ఘటన మరువక ముందే ఉద్దానంలో మరో ఎలుగుబంటి సంచారం ఇప్పుడు స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా కిడిసింగి, వజ్రపుకొత్తూరు సమీపంలోని తాడివాడ తోటల్లో కాళీమాత గుడి నుంచి గుల్లపాడు చెరువు గట్టుకు వెళ్తున్న స్థానికులు ఎలుగుబంటిని చూసి భయ కంపితులయ్యారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం అదే ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలను గుర్తు చేసుకొని ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని దాన్ని పట్టుకొని తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. కురుపాం మండలంలోని బియ్యాలవలస, గోటివాడ పంచాయతీ పరిధిలోని సూర్యనగరం, బల్లుకోట గిరిజన గ్రామాల్లో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో గిరిజనులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సూర్య నగరానికి చెందిన గిరిజన మహిళలు పొలం పనులు చేసుకొని వస్తుండగా ఎలుగు బంటి వారిపై దాడికి ప్రయత్నించటంతో ప్రాణ భయంతో పరుగులు పెడుతూ గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. మూడు రోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి జరిగిన ఘటన మరువకముందే .. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుండడంపై.. కురుపాం ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
కాగా, గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా అటవీ రేంజ్ ఆఫీసర్ మురళీక్ళష్ణ సూచించారు. గత ఏడాది కూడా బియ్యాలవలస పంచాయితీ పరిధిలోని సూర్యనగరం, పెల్లివలస, దురుబిలి, గోటివాడ, లోమడ, బల్లుకోట గ్రామాల పరిసరాల్లో ఎలుగు సంచారాన్ని గుర్తించామని చెప్పారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు, తోటల్లోకి వెళ్లొద్దని అంటున్నారు. మరలా ఎలుగు బంట్లు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన ఎలుగు బంట్లు ఇలా జనావాసాలు, గ్రామాలు, తోటల్లోకి చొచ్చుకుపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నాు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, కలప, ఇతర అవసరాలకు అడవులను విచక్షణారహితంగా కొట్టేయడంతో వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి తరచూ వచ్చే పరిస్థితులు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.