Chandrababu Naidu District Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలో 2024 టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ (YCP) అయితే ప్రత్యేక సమవేశమైంది. నేతలకు అధినేత, సీఎం జగన్ (CM Jagan) పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. గ్రాప్ పెరిగితేనే టికెట్ అంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ నెలలోనే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ (Janasean Chief Pawan Kalyan) సైతం గ్రాండ్ ప్రిపేర్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతు భరోసా పేరుతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇతర పార్టీ అధినేతల కంటే.. చంద్రబాబు ముందుగానే జనం బాట పడుతున్నారా? ఇంత సడెన్ గా చంద్రబాబు జిల్లాల టూర్ చేపట్డానికి కారణం ఏంటి..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది.. రేపటి నుంచి ఆయన జిల్లాల టూర్ ప్రారంభం అవుతోంది. అయితే తనకు బాగా సెంటిమెంట్ అయిన సిక్కోలు నుంచే ఆయన తన పర్యాటనను ప్రారంభింస్తున్నారు...
ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనల షెడ్యూల్‌ను టీడీపీ విడుదల చేసింది. ఇటీవల నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా మొదట శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చేపట్టే కార్యక్రమంలో పాల్గొంగారు చంద్రబాబు. 5వ తేదీన భీమిలి నియోజవర్గం తాళ్లవలసలో, 6వ తేదీన ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మొత్తం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా టీడీపీ ప్రణాళిక సిద్దం చేసింది. అలాగే ఏదో ఒక కార్యక్రమం పేరుతో.. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చంద్రబాబు పర్యటన ఉండనుందని టాక్..
ఇదీ చదవండి : అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వెళ్తే.. ఎస్ఐ భార్య బ్యాగ్ కొట్టేసిన ఘనుడు
శ్రీకాకుళం పర్యటన ఇలా..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం దుల్లవలస గ్రామంలో మొదట పర్యటిస్తారు. పర్యటనలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ ఛార్జి, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు గ్రామంలోపర్యటిస్తారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు గ్రామ సభలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతారు.
చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20 నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెంలో పర్యటించారు. అక్కడ స్థానిక ప్రజలతో సమావేశం అయ్యారు చంద్రబాబు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. గత 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీని ఎదుర్కోవాలంటే, ఎక్కవ కాలం జనాల్లో ఉండాలని నేతలు చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ వరుస పర్యటనలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Srikakulam, TDP