Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రథసప్తమి (Rathasapthami) వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. రథసప్తమి అంటే ముఖ్యంగా ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Surya Narayana Swamy) కరుణ కోసం.. వివిధ రకాల్లో పూజలు చేస్తారు. అలాంటి రథసప్తమి వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. జనవరి 28న జరుగునున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా బుధవారం అనివేటి మండపంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు అరసవల్లిలో ఎలాంటి అసౌకర్యం కలుకుండ చేపట్టనున్న ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్, రెవిన్యూ, పోలీసు, రవాణాశాఖలకు ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాశ రావు వివరించారు.
గత రెండున్నరేళ్లు కరోనా భయాలతో భక్తుల సంఖ్య తగ్గింది. కానీ ఈ సారి భారీగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా.. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అరసవిల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
జనవరి 27వ తేదీ అర్ధరాత్రి నుండి అరసవల్లిలో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు, నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : మీరు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి
అలాగే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, భక్తులకు నిరంతరం అందుబాటులో త్రాగు నీరు అందించే చర్యలు చేపట్టాలని, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటుచేసి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ లో రెవిన్యూ, దేవాదాయశాఖకు సంబంధించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: విదేశాల్లోనూ జనసేనకు పెరుగుతున్న క్రేజ్.. యూఏఈలో ఘనంగా పవన్ పేరుతో సంక్రాంతి సంబరాలు
ముందుగా 80 ఫిట్ రోడ్లో భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్ల పై సూచనలు అందించారు, అలాగే అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. భక్తులకు ఆసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూడాలని, పుష్కరిణి పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఇదీ చదవండి: ఆ జంట మధ్య చిచ్చు రేపిన మొబైల్ .. అసలేమైంది అంటే..?
రథసప్తమిరోజు సమంత్రక స్నానం చేయాలని అంటారు. లేకపోతే అది కాకి స్నానం అంటారు. కేవలం జిల్లేడు ఆకు, రేగిపండ్లతో మంత్రం పఠిస్తూ మాత్రమే స్నానం చేయాలి. దీంతో ఏడుజన్మల పాపం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కోరిన కోర్కెలు నెరవేరుతాయంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu festivals, Hindu Temples, Srikakulam