హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: వరుస పర్యటనలతో చంద్రబాబు బిజీ.. విజయనగరంలో భారీ ఎత్తున ఇదేం ఖర్మ కార్యక్రమం.. పూర్తి షెడ్యూల్ ఇదే

Chandrababu: వరుస పర్యటనలతో చంద్రబాబు బిజీ.. విజయనగరంలో భారీ ఎత్తున ఇదేం ఖర్మ కార్యక్రమం.. పూర్తి షెడ్యూల్ ఇదే

వరుస పర్యటనలో చంద్రబాబు బిజీ

వరుస పర్యటనలో చంద్రబాబు బిజీ

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించిన ఆయన.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తి షెడ్యూల్ ఇదే

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

Chandrababu: ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) రెండు రాష్ట్రాల్లో వరుస పర్యటనలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బిజీ బిజీ అయ్యారు. వరుస పర్యటనల్లో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లా (Vizianagaram District) రాజాం వెళ్తున్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు ఆయన టూర్‌ కొనసాగనుంది. ఈ రోజు సాయంత్రం రాజాంలో రోడ్‌షోతో పర్యటన మొదలవుతుంది. రోడ్‌షో తర్వాత రాజాం సీబీఎం చర్చిలో నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక రేపు బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించి, ఓబీసీ లీడర్స్‌తో ముఖాముఖి అవుతారు. స్థానిక సమస్యలతోపాటు పలు అంశాలపై చర్చిస్తారు.

ఇక 24వ తేదీన విజయనగరం నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఆ తరువాత రైతులతో సమావేశమవుతారు. మూడోరోజు సాయంత్రం విజయనగరం కోట జంక్షన్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. చంద్రబాబు టూర్‌ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు అనుమతులు తీసుకున్నారు. మూడ్రోజులుపాటు సాగే బాబు టూర్‌ను సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు సకల చర్యలు తీసుకున్నారు టీడీపీ లీడర్స్‌.

రణస్థలం నుంచి పొందూరు మీదుగా పార్టీ శ్రేణులను కలుస్తూ రాజాం వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో విశాఖ వస్తారు. తరువాత 12.30 గంటలకు అక్కడ బయలుదేరి 2 గంటలకు రణస్థలం చేరుకుంటారు. అక్కడ నుంచి లావేరు, ఎచ్చెర్ల మీదుగా చిలకపాలెం జంక్షన్‌కు మధ్యాహ్నం 3.30గంటలకు వస్తారు. తర్వాత పొందూరు మండలం లోలుగులో శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ నేతలు చంద్రబాబునాయుడ్ని కలుసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు పొగిరి గ్రామంలో రైతులతో చంద్రబాబు సమావేశం అవుతారు. వారి సమస్యలను తెలుసుకుంటారు.

ఇదీ చదవండి : పార్టీలో ఉన్నందుకు అసహ్యంగా ఉంది.. బైజూస్ పేరుతో 1400 కోట్ల అవినీతి అంటూ వైసీపీ నేత సంచలన ఆరోపణలు

తర్వాత విజయనగరం జిల్లా రాజాం చేరుకుంటారు. అక్కడ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు చంద్రబాబునాయుడుకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు టూర్ ఏర్పాట్లను శ్రీకాకుళం నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పానలపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. రావణాసురుడు, భస్మాసురుడు గణాలతో సీఎం జగన్మోహన్‌రెడ్డి జన్మించారు. అందుకే రావణకాష్టంలా రాష్ట్రం తయారైంద ని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఫైర్ అయ్యారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Srikakulam, Vizianagaram

ఉత్తమ కథలు