Home /News /andhra-pradesh /

SRIKAKULAM TDP CHIEF CHANDRABU NAIDU SLAMS CM JAGAN AND AP GOVERNMENT IN VIZIANAGARAM TOUR NGS VZM

Chandrababu Naidu: ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర ’ ఉత్తరాంధ్రలో జోష్ పెంచిన చంద్రబాబు పర్యటన

విజయనగరం పర్యటనలో చంద్రబాబు

విజయనగరం పర్యటనలో చంద్రబాబు

Chandrababu Naidu: గత ఎన్నికల్లో తెలుగు దేశానికి ఉత్తరాంధ్రలో ఘోర పరాభవం ఎదురైంది. విశాఖలో సిటీ మినహా.. జిల్లాలో భంగపాటు తప్పలేదు.. శ్రీకాకుళం జిల్లాల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. విజయనగరంలో అయితే.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీడీపీ కేడర్ కూడా చల్లాచెదురైంది.. అలాంటి పరిస్థితి నుంచి టీడీపీ ఇప్పుడు పుంజుకుంటోంది. తాజాగా అధినేత చంద్రబాబు పర్యటన కేడర్ లో జోష్ నింపింది..

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) దూకుడు పెంచుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాభం తరువాత.. ఇక సైకిల్ కు పూర్తిగా పంక్చర్ అయ్యిందని కోలుకోవడం కష్టమే అని వాదన వినిపించింది. ఆ తరువాత మున్సిపల్, స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ(TDP) కి కోలుకోని దెబ్బ తగలింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం.. కంచుకోట అయిన కుప్పం (Kuppam) మునిసిపాలిటీనీ సైతం వైసీపీ సొంతం చేసుకుంది. అంటే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోంది. మొదన చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు పేరుతో చేసిన జిల్లాల పర్యటనకు అపూర్వ స్పందన కనిపించింది. మహానాడు అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ జోష్ ను కంటిన్యూ చేస్తూ కేడర్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు చంద్రబాబు.. తాజాగా ఉత్తరాంధ్ర టూర్ లో మరింత దూకుడు పెంచారు. ఓ వైపు అధికార వైసీపీ పై తీవ్ర విమర్శలు చేస్తూనే.. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్నది కూడా క్లారిటీ ఇచ్చారు.

  తాజాగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు..‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర’ (Quit Jagan Save Andhra) అంటూ పిలుపు ఇచ్చారు. సీఎం జగన్ (CM Jagan)ను గద్దె దింపితేనే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రస్తుతం రాక్షసపాలన కొనసాగుతోందని ఈ నియంతపాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఈ కష్టాలన్నీ పోవడానికి జగన్ ను ప్రజలే క్విట్ చేయాలి అంటూ చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఈ కష్టాలు పోవాలంటే జగన్ ను అందరు క్విట్ చేయాలని పిలుపునిచ్చారు.  నిజాయితీపరుడైన అశోక్ గజపతిపై కేసులు పెట్టిన ఘతన వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇక రామతీర్థం దేవాలయంలో చేసిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. రామతీర్థం దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన సమయంలో తాను రామతీర్థం వస్తే తనపైనా అక్రమ కేసులు బనాయించారని.. అన్యాయాలను.. అక్రమాలను..విధ్వంసాలను ప్రశ్నించేవారిపై అక్రమ కేసలు పెట్టటమే వైసీపీకి తెలిసిన పాలన అని విమర్శించారు.

  ఇదీ చదవండి : సంగీతంలో సరిగమలు తెలియకపోయినా.. ఇంట్లో కూర్చుని మ్యూజిక్‌ నేర్చుకునే అవకాశం.. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి

  ఇక ప్రస్తుతం జనాల్ని అన్ని విధాలుగా దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరెంట్ బిల్లుల విషయంలో తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్ ఇప్పుడు తన పాలనలో అత్యంత భారీగా కరెంట్ బిల్లులు పెంచేసారని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రాగా చేసి మూడు రాజధానులు అంటూ విధ్వంసక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ప్రజలంతా ‘క్విట్’చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రాలో ఉన్న వనరుల్ని దోచుకోవటానికి విశాఖను రాజధానిగా ప్రకటించారని రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల్ని రోడ్డుమీకు ఈడ్చిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు.

  ఇదీ చదవండి : ఆహ్లాదకర వాతావరణంలో టెట్‌కు ప్రిపరేషన్.. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. ఎలా చేయాలంటే?

  స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణకు కు సారా వ్యాపారం మాత్రమే తెలుసన్నారు. పాలన అంటే ఏంటో తెలీదు అంటూ ఉత్తరాంధ్ర జగన్ పెత్తనం ఏంటి? విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. తల్లిదండ్రులకు వారి బిడ్డలమీద శ్రద్ధ లేకపోవటం వల్లే విద్యార్థులు పరీక్ష ఫెయిల్ అయ్యారని మంత్రి బొత్స అంటున్నారని ఇది చాలా దారుణం అని మండిపడ్డారు. తాజాగా ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ ఇటు నాయకులు, అటు కేడర్ లో కొత్త ఉత్సాహం నింపింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ ఘోర అమానం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లాలో కేవలం రెండు సీట్లు, విశాఖ నగరంలో నాలుగు సీట్లు తప్పా మిగిలిన అన్ని చోట్లా ఓడిపోయారు. ఇక విజయనరాన్ని అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఉత్తరాంధ్రలో టీడీపీ ఖేల్ ఖతం అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా చంద్రబాబు పర్యటనకు అపూర్వ ఆదరణ రావడంతో.. పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు