Home /News /andhra-pradesh /

SRIKAKULAM SRIKAKULAM NEWS ONE AND OF YEAR KID PLAYING WITH WATER BUT VERY TRAGEDY NGS VZM

Crime News: ఆడుకోడానికని బాత్ రూమ్ కు వెళ్లిన చిన్నారి.. బలితీసుకున్న బకెట్..?

చిన్నారిని బలితీసుకున్న బకెట్

చిన్నారిని బలితీసుకున్న బకెట్

Crime News: సరదగా ఆడుకోవాలి అనుకోవడమే ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. నీటిలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని ఓ బకెట్ బలి తీసుకుంది.. ఇంతకీ ఏమైందంటే..?

    Crime News:  మండు వేసవి కాలం.. భగభగ మండే మంటలతో వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టమే.. ఇలాంటి సమయంలో చల్లని నీళ్లు కనిపిస్తే.. అక్కడే ఉండాలి అనిపిస్తుంది ఎవరికైనా.. అలా ఓ చిన్నారి సైతం బాత్ రూమ్ లో బకెట్ లో నీళ్లు చూసి.. సరదగా ఆడుకోవాలి అనుకున్నాడు.. కానీ అలా బాత్ రూమ్ కు వెళ్లడమే ఆ బాలుడి పాలిట శాపమైంది. ఓ కుటుంబంలో విషాదం నింపింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) టెక్కలి మండలం పోలవరంలో ఈ విషాదం చోటు చేసుకుంది.  ఏడాదిన్నర చిన్నారి మరణంతో  తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నవ్వడం.. ఏడవడం తప్ప ఏమీ తెలియని ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

    నిన్నటి వరకు  ఆ బాలుడి బోసి నవ్వులు చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తుంటే ఆనందపడ్డారు. ఇంతలో ఊహించని ఘటన వారి ఆశలను ఆవిరి చేసింది. సరదాగా ఆడుకుంటున్న ఆ ఏడాదిన్నర వయసు ఉన్న చిన్నారిని నీళ్ల టబ్బు రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. టెక్కలి మండలం పోలవరంలో బుధవారం చోటుచేసుకున్న గ్రామంలో విషాదం నింపింది.

    ఇదీ చదవండి : ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్.. ఎందుకో తెలుస్తే.. షాక్ అవుతారు..?

    బోసినవ్వులతో ముద్దులొలికే ఆ బాలుడిని ఊహించని రీతిలో మరణం వెంటాడింది. తను ఆడుకుంటున్న నీళ్లతో నిండి ఉన్న టబ్ లో పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మ్ళతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన యడ్ల కృష్ణారావు, భాగ్యవతి దంపతుల కుమారుడు 18 నెలల మిధున్‌కుమార్‌ నీళ్ల టబ్ లో పడి ప్రమాదవశాత్తు మృతిచెందాడు.

    ఇదీ చదవండి : సీఎం కాన్వాయ్ కు సర్కార్ వాహనాల్లేవా? సస్పెండ్ తో సరిపోతుందా? ప్రభుత్వంపై విపక్షాల ఫైర్

    బాలుడి తండ్రి కృష్ణారావు సారవకోట మండలంలో రెవెన్యూ శాఖలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి భాగ్యవతి గృహిణి. బుధవారం ఇంట్లో తల్లి భాగ్యవతి ఇంటిలో పనులు చేస్తుండగా.. చిన్నారి మిధున్‌ నీళ్ల టబ్బు వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లోని టబ్ లో పడిపోయాడు. కొద్దిసేపటి తన కుమారుడి నుండి ఎలాంటి శబ్ధం రాకపోవడంతో అనుమానం వచ్చి.. భాగ్యవతి గమనించింది.

    ఇదీ చదవండి : మళ్లీ టీడీపీ ప్రతిపక్షంలోనే.. సీనియర్ నేతలకు చంద్రబాబు క్లాస్.. సీట్లపై క్లారిటీ

    అప్పటికే బాత్ టబ్ లో పడి తలకిందులుగా తేలి ఉండడాన్ని తల్లి గమనించింది. వెంటనే.. నీళ్ల టబ్బులో ఉన్న చిన్నారిని బయటకు తీయగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఆ చిన్నారిని తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లి భాగ్యవతి కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు