హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Power Cuts: తప్పని సరై ఆస్పత్రికి వెళ్తున్నారా..? అయితే మీతో పాటు ఇది ఉండాల్సిందే..?

Power Cuts: తప్పని సరై ఆస్పత్రికి వెళ్తున్నారా..? అయితే మీతో పాటు ఇది ఉండాల్సిందే..?

ఆస్పత్రులకు వెళ్తున్నారా..? ఇది మరచిపోకండి..

ఆస్పత్రులకు వెళ్తున్నారా..? ఇది మరచిపోకండి..

Power Crises: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సమస్యలకు ఎండ్ పడేది ఎప్పుడు..? స్వయనా మంత్రే మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పవంటున్నారు. అయితే ఈ ప్రభావం ఆస్పత్రులపైనా పడుతోంది. అందుకే ఏపీలో హాస్పిటల్ కు వెళ్లాలి అంటే ఇకపై అది ఉండాల్సిందే అంటున్నారు జనం.

ఇంకా చదవండి ...

Power Crises:  అస‌లే ఎండాకాలం. ఉక్క‌బోత ఎక్కువ‌. చెమ‌ట‌లూ ఎక్కువే. ఫ్యాన్ లేనిదే క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్ కోతలతో.. రోగులు, వారి బంధువులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉక్కపోత భరించలేక... దోమల బెడద తట్టుకోలేక ఆసుపత్రులకు వస్తున్న రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విసనకర్రలు సహా చేతికి ఏది దొరికితే దానితోనే విసురుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రి సీదిరి అప్పలరాజు (Minster Sidiri Appala Raju), రాజన్నదొర (Rajanna Dora), బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వంటి ముఖ్య నాయకులున్న ప్రాంతాలలోని సామాజిక ఆసుపత్రుల్లో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవేకాక విద్యుత్ కోతలతో విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలలోని అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospitals) విద్యుత్ కోతలతో  (Power Cuts)ఇదే పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో పట్టపగలే చేతిలో విసనకర్రలతో రోగులు అవస్ధలు ఎదుర్కొంటున్నారు.స

విద్యుత్‌ కోతలతో రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వాస్పత్రులు గాఢాంధకారంలో మగ్గుతున్నాయి. సెల్‌ఫోన్‌ లైట్ల మధ్య రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణపైనా విద్యుత్తు కోతల ప్రభావం కనిపిస్తోంది. ఉక్కపోత భరించలేక,  దోమల బాధ తట్టుకోలేక ఇన్‌పేషెంట్లు అల్లాడిపోతున్నారు. రోగులు, వారి సహాయకుల చేతుల్లో విసనకర్రలు కనిపిస్తున్నాయి.  కోట్ల రూపాయలతో ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. రోగులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండడం లేదు. ఆసుపత్రులకు వస్తున్న రోగులు, వారి బంధువులు.. కరెంట్ కష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి : టోల్ ఫీజు అడిగినందుకు చుక్కలు చూపించిన డ్రైవర్.. ఏం చేశాడో చూడండి

ఓవైపు కరెంట్ కోతలతో ఉన్న ఫ్యాన్లు తిరగక కొన్ని చోట్ల రోగులు ఇబ్బందులు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఫ్యాన్లు కూడా ఉండడంలేదు. దీంతో రోగులు, రోగుల బంధువుల చేతుల్లో విసనకర్రలు, కనిపిస్తున్నాయి.

విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు ఇటీవల సాధారణమయ్యాయి. ఆసుపత్రుల్లో ఎడాపెడా క‌రెంట్ కోసేస్తున్నారు. ఓ టైమ్ లేకుండా.. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఇబ్బందులు తప్పడం లేదని రోగులు వాపోతున్నారు.

ఇదీ చదవండి : తండ్రి అంతపని చేస్తాడనుకోలేదు.. పుట్టింటిపై కూతురి పోరాటం.. అసలు స్టోరీ ఇదే..!

ఇటీవల జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో .. విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పనిచేయకపోవడంతో.. అదే సమయంలో వచ్చిన ఒక గర్భిణీకి డెలివరీ చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడి స్టాఫ్ నర్సులు కొవ్వొత్తులు, చార్జింగ్ లైట్లు, వారి మొబైల్ లైట్ల సాయంతో డెలివరీ చేశారు.

ఇదీ చదవండి : ఒకటి రెండు కాదు.. 300 లారీలు.. 48 గంటలకుపైగా అవస్థలు.. భువనేశ్వర్ లో ఏం జరిగిందంటే..?

కొన్ని ఆసుపత్రుల్లో జనరేటర్లు కొన్నిచోట్ల ఉన్నా... మరమ్మతుల కారణంగా పనిచేయట్లేదు. సాలూరు చుట్టుపక్కల మండలాలలోని గిరిజనులంతా అనేక సమస్యలతో.. ఇక్కడి సీహెచ్సీలోని ఇన్‌ పేషెంట్లుగా చేరేందుకు వస్తుంటారు. రోగులతో ఇక్కడి ఆసుపత్రి కిటకిట లాడుతూ  ఉంటుంది. అయితే ఇక్కడ విద్యుత్తు కోతల కారణంగా తరచూ అంధకారం నెలకొంటోంది. జనరేటర్‌ ఉన్నా.. డీజిల్‌ లేదు. పగటివేళ కూడా విద్యుత్తు కోతలతో చికిత్సలకు ఇబ్బంది కలుగుతోంది.

ఇదీ చదవండి : మంత్రి పదవి నుంచి ఎందుకు పక్కన పెట్టారంటే..? ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని క్లారిటీ

విజయనగరం జిల్లావ్యాప్తంగా విద్యుత్తు కోతలతో ఆస్పత్రులలో రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో జనరేటర్లు ఉన్నా డీజిల్‌ కొనుగోలుకు నిధుల్లేక కొన్నిచోట్ల మూలపెట్టారు. చీపురుపల్లి, భోగాపురం వంటి ప్రాంతాలలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆసుపత్రుల్లో ఇన్వర్టర్లు ఉన్నా వాటి సామర్థ్యం చాలట్లేదు. రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సొంత డబ్బులతో డీజిల్‌ కొంటున్నారు. ఇక చీపురుపల్లి సామాజిక ఆస్పత్రిలో ఇన్వర్టరు సదుపాయాన్ని లైట్లకే పరిమితం చేశారు.

ఇదీ చదవండి : కూలీలను ఆశ్చర్యపరిచిన కలెక్టర్.. గ్రామీణ ఉపాధి హామీ పనుల పరిశీలనకు ఏం చేశారంటే..?

శ్రీకాకుళం జిల్లా పలాస సామాజిక ఆసుపత్రిలో.. ఇటీవల పలాస మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ.. తన భర్తతో ఉన్న కలహాల కారణంగా .. తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.  స్ధానికంగానే ఉన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు..  ఆ ఆస్పత్రికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి మహిళను, పిల్లల్లను  పరామర్శించారు. ఆ సమయంలో అక్కడి ఆసుపత్రిలో విద్యుత్ కోతల కారణంగా రోగులు అనేక ఇబ్బందులు పడుతూ కనిపించారు.  ఇలా అప్రకటిత విద్యుత్ కోతలు, ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో.. రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇక మీదట ఆసుపత్రికి వెళ్తున్నారా..? విసనకర్ర పట్టుకెళ్లడం తప్పనిసరి అనేలా పరిస్థితి మారిపోతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Power cuts, Power problems

ఉత్తమ కథలు