హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వైసీపీ కంటే టీడీపీ టికెట్ కోసమే పోటీ ఎక్కువ..! ఆ జిల్లాలో ఆసక్తికరంగా మారిన వార్

AP Politics: వైసీపీ కంటే టీడీపీ టికెట్ కోసమే పోటీ ఎక్కువ..! ఆ జిల్లాలో ఆసక్తికరంగా మారిన వార్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Srikakulam, India

  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు అధినేతలు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం (Srikakulam District) అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి సిక్కోలు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అధికార వైసీపీ (YSRCP) తరఫున ఇప్పటికే సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Prasad Rao) దాదాపు ఖరారయ్యారు. మరోసారి సిక్కోలు నుంచి ఆయనే పోటీ చేస్తారని పార్టీ నేతలు చెప్పేస్తున్నారు.

  ఇక తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) తరఫున టికెట్ కోసం పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రస్తుతం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అప్పుడప్పుడూ పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నారు తప్ప.. వయోభారం కారణంగా పార్టీ బాధ్యతలను ఇతరులకు అప్పగించారు. దీంతో నియోజకవర్గంలోని కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదో ప్రెస్ కోసం ఫోటోలు తప్ప.. వీరివల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చివరికి నియోజకవర్గం పరిశీలకుల సమావేశంలో సైతం కొందరు మహిళా నేతలు పార్టీలో ఇతర నేతలపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక సోషల్ మీడియాలో సైతం బిల్డప్ లీడర్లు అంటూ వ్యంగ్యాస్త్రాలు పేలుస్తున్నారు.

  ఇది చదవండి: టీడీపీకి కొత్త తలనొప్పులు.. ఒకే కుటుంబంలో ఆధిపత్యపోరు.. చంద్రబాబు ఓటు ఎవరికి..?


  పార్టీ టికెట్ కోసం గుండ లక్ష్మిదేవితో పాటు మరో ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 2009లో శ్రీకాకుళం నియోజకవర్గం తరఫున ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన కోర్ను ప్రతాప్... ఈసారి టీడీపీ తరఫున తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ద్వారా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యువత కోటాతో పాటు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సమయంలో వచ్చిన ఓట్లు, తన ఫాలోయింగ్ వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..!


  అలాగే ఇప్పుడు తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. వెలమ సామాజిక వర్గానికే చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గొండు శంకర్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని గార మండలానికి చెందిన మాజీ జెడ్‌పీటీసీ గొండు జగపతి కుమారుడిగా ఇప్పటికే గుర్తింపు సంపాదించారు. పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న గొండు జగపతి... తన రాజకీయ వారసునిగా శంకర్‌కు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని రాష్ట్రస్థాయి నేతలతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలని శంకర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

  గుండ లక్ష్మీదేవి వయోభారం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని... కాబట్టి యువత కోటాలో తమకు అవకాశం కల్పించాలని అటు కోర్ను ప్రతాప్, గొండు శంకర్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో టికెట్ కోసం త్రిముఖ పోటీ తప్పేలా లేదనే మాట జోరుగా వినిపిస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Srikakulam, TDP

  ఉత్తమ కథలు