SRIKAKULAM POLICE DOG FUNERAL AT VIZAINAGARAM DOG ROCKY WORK 7 YEARS AT POLICE DEPARTMENT NGS VZM
Rockey: సలామ్ రాఖీ.. పోలీసు డాగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియులు.. ఎంత సేవ చేసిందంటే?
పోలీస్ డాగ్ కు సలామ్
Rockey Dog: దాని పేరు రాఖీ.. నిజంగానే రాఖీ భాయ్ అని గుర్తింపు తెచ్చుకుంది. పోలీసులు ఎంతో క్లిష్టంగా భావించే కేసులను సైతం చేధించడంలో కీ రోల్ పోషించింది. ఏడేళ్ల పాటు ఎన్నో సేవలు అందించింది. అందుకే ఇప్పుడు అత్యంత గౌరవం అందుకుంది.
Dog Rockey: సాధరణంగా విశ్వాసం అంటే కుక్కతోనే పోలుస్తారు.. ఎందుకంటే కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. ఎక్కడ పని చేస్తే.. అక్కడ తన యజమాని చెప్పినట్టే నడుచుకుంటుంది. వారికి రక్షణగా ఉంటుంది. కొన్ని కుక్కలు మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి అలాంటి వాటిలో రాఖీ ఒకటి.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..? పరిస్థితులను పసిగట్టేతత్వం.. ఎదుటి వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించే నైజం.. దాని సొంతం. నిరంతరం నేర పరిశోధనా దృష్టితో పోలీసులకు సైతం అంతుచిక్కని అనేక కేసులను సునాయాసంగా ఛేదించడంలో దానికదే సాటి. పేలుడు పదార్ధాలైనా, భూమిలో దాచిన బాంబులైనా లెక్కలేదు. వాటిని ఇట్టే గుర్తుపట్టి పలువురి ప్రాణాలను కాపాడింది కూడా. పోలీస్ శాఖలోని డాగ్ స్క్వాడ్ (Dog Squad) గా పనిచేస్తున్న "రాఖీ" (Rokey). ఏడేళ్ల పాటు సమర్ధవంతంగా పని చేసి, అనారోగ్య కారణాలతో పోలీసు జాగిలం.. జూన్ 14న మృతి చెందింది. దీంతో రాఖీకి అధికారిక పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు జిల్లా పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా (Vizianagaram District) పోలీస్ శాఖలో పోలీస్ డాగ్ స్క్వాడ్ లో కీలకమైన పోలీసు డాగ్ అయిన “రాఖీ” మరణించింది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన రాఖీ పుట్టినప్పటినుండే చాలా చురుగ్గా ఉండేది. హైదరాబాద్ ఇంటిలిజెన్సు సెక్యూరిటీ వింగ్ లో శిక్షణ పొందిన రాఖీ.. శిక్షణ తరువాత 2015 సంవత్సరంలో విజయనగరం జిల్లాకు వచ్చింది. సుమారు 7 ఏళ్లు సమర్థవంతంగా పని చేసి పోలీసుశాఖకు విశేషమైన సేవలు అందించింది.
ముఖ్యంగా నేర పరిశోధనలో హంతకుల ఆచూకీ పసిగట్టటంతో పాటు శిక్షణలో నేర్చుకున్న అనేక అంశాలతో పాటు జిల్లా పోలీసు ప్రాంగణంలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక విన్యాసాలు చేసి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్ధులను విశేషంగా ఆకట్టుకునేది. అందుకే ఆ జాగిలం అంటే అందరికీ అంత ప్రేమ. జిల్లా ఎస్పీ ఎం.దీపిక (SP M Deepika) రాఖీ మ్ళతి పట్ల నివాళులు అర్పిస్తూ.. రాఖీ మ్ళతి జిల్లా పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు.ముఖ్యంగా పేలుడు పదార్థాలను, భూమిలో దాచిన బాంబులను గుర్తించుటలో విశేషమైన గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖపట్నం పర్యటనలో భద్రతా ఏర్పాటు చర్యలలో భాగంగా పోలీసు జాగిలం 'రాఖీ’ తనిఖీలు నిర్వహించుటలో అత్యంత కీలకంగా వ్యవహరించిందన్నారు. అంతేకాకుండా, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మందుపాతర్లు, పేలుడు పదార్ధాలు తనిఖీలు నిర్వహణలో కీలక పాత్ర పోషిందన్నారు.
అత్యంత క్లిష్టమైన కేసులను చేధించడంలో ముందుండే రాఖీ అనారోగ్య కారణాలతో జూన్ 14, మంగళవారం మృతి చెందిందన్నారు. దాని అంత్యక్రియలను అయ్యన్నపేట శ్మసానవాటికలో అధికార లాంఛనాలతో పోలీసు శాఖ నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. రాకీ సేవలను గుర్తు చేసుకుంటూ జిల్లా పోలీసులు... పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.