హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: ట్రైన్‌లో 4.21కోట్ల విలువైన బంగారం పట్టివేత ..స్మగ్లర్లు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే

Crime News: ట్రైన్‌లో 4.21కోట్ల విలువైన బంగారం పట్టివేత ..స్మగ్లర్లు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే

Gold Smuggling

Gold Smuggling

Crime News: శ్రీకాకుళం జిల్లాలో గోల్డ్‌ స్మగ్లర్లు పట్టుబడ్డారు.బంగ్లాదేశ్ నుంచి సీక్రెట్‌గా తెచ్చిన గోల్డ్‌ను వేరే వ్యక్తికి అప్పగిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.స్మగ్లర్ల నుంచి నాలుగున్నర కోట్ల విలువైన గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శ్రీకాకుళం జిల్లాలో గోల్డ్‌ స్మగ్లర్లు(Gold Smugglers) పట్టుబడ్డారు. శ్రీకాకుళం రోడ్ నిలయం (ఆమదాలవలస ) రైల్వే స్టేషన్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు DRI అధికారులు. పట్టుబడిన దొంగలు కోలకత్తా నుండి హౌరా- చెన్నై మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ రైలు(Howrah-Chennai Mail Super Fast Express Train) ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ట్రైన్ ద్వారా వచ్చిన స్మగ్లర్లు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ల మరో వ్యక్తికి గోల్డ్ ఉన్న బ్యాగ్ అందజేస్తుండగా పట్టుకున్నారు రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు.

పెద్ద మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్..

ఈ భారీ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులును అదుపులోకు తీసుకున్నారు రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. గోల్డ్ స్మగ్లర్ల నుంచి సుమారు 4.21 కోట్ల విలువైన 7.396 కేజీల బంగారపు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా బంగ్లాదేశ్ దేశ్ నుండి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra pradesh news, Crime news, Srikakulam

ఉత్తమ కథలు