Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు.. సిల్వర్, బిగ్ స్క్రీన్లపై ఆర్.కె రోజా (RK Roja) డ్యాన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆమె డ్యాన్స్ కి సైతం అభిమానులు ఉన్నారు అన్నది అతిశయోక్తి కాదు.. కేవలం హీరోయిన్ గా ఉన్నప్పుడు కాదు.. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆమె గ్రేస్ తగ్గలేదు. అందుకే రోజాను విపరీతంగా అభిమానులు ఆమె ఫ్యాన్స్.. కానీ ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిల్వర్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పేశారు. ఎలాంటి వినోదాత్మక కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వెండతెరకు వీడ్కోలు పలికారు. మంత్రి హోదాలో హుందగా వ్యవహరిస్తే.. మేడర్ సార్ మేడమ్ అనేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ రోజా.. మెరుపులు మెరిపించారు.. ఓ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఎక్కడంటే.. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో 76 వ స్వాతంత్య్రం సందర్భంగా కళ్లేపల్లిలోని ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంస ధ్వని తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా.. 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరై హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె.. అక్కడి వారందరి కోరిక మేరకు.. పాటకు స్టెప్పులేశారు. చామంతి పువ్వా పువ్వా… అనే పాటకు స్టెప్ లు వేసి జనాలను మంత్రి రోజా ఉత్సాహ పరుస్తూ.. వారితోపాటు మంత్రి రోజా స్టెప్పులు వేశారు. దీంతో ఆప్రాంతమంతా ఆటపాటలతో సంతోమయమైంది. మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే అనడానికి నిర్వచణంగా ఆప్రాంతమంతా నిదర్శనమైంది.
View this post on Instagram
తరువాత మంత్రి మట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం సంప్రదాయ గురుకుళంలో గత మూడు రోజులుగా జరుగుతున్న హంసధ్వని మెగా ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. యావత్ భారత దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్వాతి సోమనాథన్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందలు తెలపాలన్నారు.
మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఈ హంసధ్వని ద్వారా.. గొప్ప సందేశాన్ని ఇక్కడున్న ప్రజలకు అందించారని పేర్కొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఆమె చెప్పారు. ఇలాంటి వజ్రోత్సవాలలో భాగంగా.. మన దేశంలోనే వజ్రం లాంటి సంప్రదాయ గురుకులంకి తాను రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి : ఓట్లు చీలకూడదు అన్న పదానికి అర్థం ఇదే.. పొత్తులపై తేల్చి చెప్పేసిన పవన్
అన్నారు. ఈకార్యక్రమ ఉద్దేశం ధ్యానం మంచి ఆరోగ్యానికి సహకరించే సాధనా ప్రక్రియ అని రోజా పేర్కొన్నారు. అటువంటి ధ్యాన సంబంధ పిరమిడ్ల నిర్మాణానికి సహకరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు మంత్రి రోజా. పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం. క్రీడల వైపు కాస్త ద్రుష్టి మల్లించేల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నానని రోజా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Independence Day 2022, Minister Roja, Srikakulam