హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Minister: ఔను నిజమే జగన్ పై వ్యతిరేకతకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

AP Minister: ఔను నిజమే జగన్ పై వ్యతిరేకతకు అదే కారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

AP Minister: సీఎం జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న ధర్మాన వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారుతున్నాయి. మరోసారి ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఔను నిజమే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. అందుకు జగన్ చేస్తున్న సంస్కరణలే కారణం అన్నారు. అక్కడితోనే ఆయన ఆగలేదు.. రోడ్లపై గుంతలు ఉన్నమాట వాస్తవమే అని.. తాము ఏమైనా కన్నాలు పెట్టామా అంటూ ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

AP Minister: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. చాలా రోజుల నుంచి విపక్షాలు చేస్తున్న విమర్శ ఇది..  విపక్షాలు అన్నతరువాత ఆ విమర్శ చేయడం కామన్.. కానీ అధికార పార్టీ నేతలే ఆ మాట అంటే.. అంది కూడా స్వయంగా జగన్ కేబినెట్ లో ఉన్న కీలక మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. సంచలనమే.. ఇదే కాదు.. ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాద రావు (Minister Dharmana Prasada Rao) ఏం మాట్లాడినా అలాగే ఉంటోంది. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. లేక కావాలని మాట్లాడుతున్నారో.. కారణం ఏదైనా ఆయన ప్రకటనలో వైసీపీలో ప్రకంపణలు పుట్టిస్తున్నాయి. ఆ మధ్య రాజీనామాల వ్యవహారం గందరగోళమే రేపింది.  అది మరువకుముందే..  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సహా అంతా మూడు రాజధానులే ముద్దు అంటుంటే.. ధర్మాణ మాత్రం ఏపీకి ఒకే రాజధాని అంటూ ప్రకటించేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వేడి ఇంకా తగ్గలేదు.. ఇప్పుడు జగన్ పై మరో బాంబ్ వేశారు.. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు జగన్‌పై తీవ్ర వ్యత్రికత నిజమేనని అంగీకరించారు. అక్కడితోనే ఆయన ఆగలేదు.. ఆ వ్యతిరేకతకు కారణం ఏంటో కూడా వివరణ ఇచ్చారు..

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మాన.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత సంస్కరణలే కారణం అన్నారు. సంస్కరణలు అమలు చేసే వారికి ప్రజా వ్యతిరేకత తప్పని సరి అన్నారు. మొదట్లో ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని.. సంస్కరణల ఫలితాలు ప్రజలకు అర్థం కావడానికి సమయం పడుతుందన్నారు. ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా జగన్ సంస్కరణలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఆయన ఉద్దేశం ఏదైనా.. జగన్ పై వ్యతిరేకత ఉంది అన్న విషయమే ఇక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఇటు సీఎం జగన్ కానీ.. ఇరత మంత్రులు, నేతులు కానీ.. అసలు ప్రజల్లో తమ పాలనపై వ్యతిరేకత అనేదే లేదని.. అందుకే వై నాట్ 175 అని ధీమాగా చెబుతున్నారు. ఇక జగన్ అయితే పెట్టిన ప్రతి సమావేశంలో 175కి 175 ఎందుకు రావని నేరుగా నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయని వారికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. వ్యతిరేకత ఎందుకు ఉంటుందని చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ధర్మాన కామెంట్స్.

ఇదీ చదవండి : చంద్రగ్రహణం వీడడంతో తెరుచుకున్న ఆలయాలు.. ఇత్తడి పళ్లెంలో రోకలి నిలబెట్టి ప్రత్యేక పూజలు

మరోవైపు అసలు జగన్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు ఏంటో కూడా చెప్పాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపైనా తీవ్ర విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై విపక్షాల ఆందోళనలు కూడా కొనసాగాయి. కానీ ప్రభుత్వం, అధికారులు మాత్రం రోడ్లు అద్బుతంగా ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఉన్నాయి ధర్మాన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే.. గత ప్రభుత్వంలో రహదారులపై ఏర్పడిన కన్నాలే ఇప్పుడు పెద్దవై ఉంటాయని.. తాము ఏమైనా రోడ్లపై కన్నాలు వేశామా అంటూ తిరిగి ప్రశ్నించారు మంత్రి ధర్మాన.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News