Home /News /andhra-pradesh /

SRIKAKULAM LADY IAS OFFICER SON JOINED IN GOVERNMENT SCHOOL IN SRKIKAKULAM DISTRICT ANDHRA PRADESH NGS VSP

IAS Officer: ప్రభుత్వ ఆఫీసర్ అంటే ఈమె.. కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన నవ్య

కొడుకుని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేసిన ఐఏఎస్

కొడుకుని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేసిన ఐఏఎస్

IAS Officer: ప్రభుత్వ స్కూళ్ల గురించి గొప్పలు చెబుతారు.. కానీ ఒక ప్రభుత్వ అధికారి కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో జాయిన్ చేయరనే విమర్శ ఉంది. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం అందరికి తాను భిన్నం అంటున్నారు. స్థోమత ఉన్నా తన కొడుకుని ప్రభుత్వ స్కూల్ లోనే జాయిన్ చేశారు.

ఇంకా చదవండి ...
     P Anand Mohan, News18,Visakhapatnam.

    IAS Officer: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఐఏఎస్‌ ఆఫీసర్‌ (IAS Officer) బి.నవ్య (B Navya) అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా అధికారులు అంతా ప్రభుత్వం గురించి గొప్పగా చెబుతారు.. అంతేకాదు ప్రభుత్వ పాఠశాల (Government School) గురించి గొప్పలు చెబుతారు.. కానీ ఆ స్కూల్ మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. కాని నవ్య మాత్రం వారందరికీ భిన్నం.. తన కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు ఆమె చెప్పిన మాట వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. తాను కూడా గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్‌ అధికారిణి అయ్యానని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని గొప్పవారు ఎందరో మనకు ఆదర్శంగా ఉన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని సీతంపేట ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్మెంట్‌ ఏజెన్సీ (ఐటీడీఏ) (ITDA) ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(పీవో) (PO)గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు బి.శ్రీకర్‌ ప్రతిక్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. అతణ్ని నవ్య.. మల్లి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చేర్పించారు.

    ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. గవర్నమెంట్‌ బడులు ప్రైవేట్‌ స్కూల్స్‌కి ఏమాత్రం తీసిపోవని విధంగా మార్చారని గుర్తు చేశారు. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అన్ని చోట్లా ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని ఆమె అభిప్రాయపడ్డారు.



    సీతంపేట మండలంలో ప్రైవేట్‌ స్కూల్స్‌ లేవని, 40 కిలో మీటర్ల దూరంలోని పాలకొండ మండలంలో ఉన్నాయని నవ్య చెప్పారు. నిత్యం 40 కిలో మీటర్లు వెళ్లటం, రావటం ఇబ్బందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని ఆమె వివరించారు. అయితే ప్రస్తుతం చాలాచోట్ల పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్స్‌లో జాయిన్‌ చేయించేందుకు మధ్య తరగతి కుటుంబాల పేరెంట్స్‌ సైతం పోటీపడుతున్న ఈ రోజుల్లో.. ఇలా ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ తన కుమారుణ్నిసర్కారు బడిలో జాయిన్‌ చేయించటం నిజంగా అధినందించదగ్గ విషయమని అంతా చర్చ మొదలైంది.

    ఇదీ చదవండి : ఇదీ బాలయ్య అంటే.. స్వయంగా ఫోన్ చేసి అభిమాని ఫ్యామిలికీ సర్ ప్రైజ్.. ముద్దులు కురిపిస్తున్న మహిళలు

    ఒకవేళ ఐఏఎస్ నవ్య తలచుకుంటే తన కొడుకుని ఏ కార్పొరేట్‌ స్కూల్లోనో చేర్చించగలరు. కానీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి ఉచితంగా చదువు చెబుతున్నప్పుడు లక్షలు ఖర్చు చేయటం దేనికి అనేది ఆమె ఉద్దేశంగా కనిపిస్తోంది అని ప్రసంశిస్తున్నారు. ఇతర అధికారులు సైతం ఆమె బాటలో నడవాలని ఆమె కోరుతున్నారు. సాక్షాత్తూ ఒక ప్రభుత్వ అధికారిణి అయినా.. ఆమె ఆ ప్రభుత్వ బడి పైనే నమ్మకం ప్రదర్శించకపోతే ఎలా?. ఆర్థిక స్తోమత అనే సంగతిని పక్కన పెట్టి అసలు ఆ స్కూల్లో మంచిగా చదువు చెబుతున్నారా లేదా అనేది చూడాలి. నిజం చెప్పాలంటే ప్రైవేట్‌ స్కూల్లో కన్నా గవర్నమెంట్‌ బడిలోనే ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు. కాకపోతే పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక వాళ్లతో రెగ్యులర్‌గా హోం వర్క్‌ చేయిస్తూ అర్థంకాని విషయాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు వివరిస్తే సరిపోతుంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Srikakulam

    తదుపరి వార్తలు