Home /News /andhra-pradesh /

SRIKAKULAM IS THERE CLASH BETWEEN AP TDP PRESIDENT ATCHANNAIDU AND MP RAMMOHAN NAIDU NGS VPS

Telugu Desam: అసెంబ్లీకి సై అంటున్న రామ్మోహన్.. బాబాయ్ అందుకు ఒకే అంటారా..? ఇంటిపోరు తప్పదా..?

బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ..?

బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ..?

Telugudesam clashes: ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన నేతలు.. ప్రతిపక్ష పార్టీలో ఇద్దరికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ఒకరు బాబాయ్.. మరొకరు అబ్బాయి. అయితే ప్రస్తుతం ఒకరు ఎంపీగా.. ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు.. కానీ వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ ఎమ్మెల్యేగానే పోటీ పడాలి అనుకుంటున్నారు.. మరి ఈ పోటీలు ఎవరు వెనక్కు తగ్గుతారు..?

ఇంకా చదవండి ...
  P Anand Mohan, News18,Visakhapatnam

  Telugu Desam Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో వారిద్దరూ కీలక నేతలు.. ఒకరు ఎంపీ గా ఢిల్లీలో వ్యవహారాలు చూస్తుంటే.. మరోకరు ఎమ్మెల్యేగా.. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇద్దరూ పార్టీకి కీలక నేతలే.. అన్నిటికన్నా వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు.. ఇద్దరిరీ రక్త సంబంధమే.. ఒకరు బాబాయ్ అయితే.. మరొకరు అబ్బాయి. గత ఎన్నికల వరకు.. ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా ఉంటూ వచ్చారు. ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉండేది.. కానీ గత ఎన్నికల తరువాత పరిస్థితి మారింది. పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయినా.. నేతలు ఎవరికి వారు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చాలాకాలంగా ఇద్దరికీ పడడం లేదనే విమర్శలు.. పార్టీ కేడర్ లో ఉంది. ఎవరికి వారు జిల్లాలో పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. తాజాగా ఇప్పుడు మరో అంశం ఇద్దరి మధ్య విబేధాలకు కారణం అయ్యే అవకాశం ఉంది. అది ఏంటంటే.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu).. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది.  

   శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) రాజకీయాల్లో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తండ్రి ఎర్రన్నాయుడు మృతితో అనూహ్యంగా రాజకీయాల్లోకి తెరంగ్రేటం చేసిన ఆయన తనయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. కొద్దికాలంలోనే తనదైన ముద్ర వేశారు. డైనమిక్‌ నేతగా గుర్తింపు పొందారు.  దీనికితోడు ఉన్నంత విద్యావంతుడు.  ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడటం ఆయనకు అదనపు బలం. దీనివల్లే యువకుడే అయినా టీడీపీలో ఆయనకు అంత గుర్తింపు దక్కింది. 

  అందులోనూ రాజకీయంగానూ పేరున్న కుటుంబం కావడంతో దేశ రాజకీయాల్లోనే ఆయనపై ప్రత్యేక దృష్టి ఎప్పుడూ ఉంటోంది. తెలుగుదేశం పార్టీ వాణిని పార్లమెంట్‌ సభ్యునిగా ఇన్నాళ్లూ దిల్లీలో వినిపించిన ఆయన.. తాజాగా మనసు మార్చుకుని, ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగాలన్న ఆలోచనతో ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అతి చిన్న వయసులోనే ఇంతటి  ఛరిష్మా ఉన్న నేత లోక్‌సభ బరిలో ఉంటేనే మంచిందని.. బాబాయ్ తో సహా.. పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలా అయితే నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఓట్ల శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

  ఇదీ చదవండి: చంద్రబాబు ప్రయాణిస్తున్న పడవ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

   రామ్మోహన్ నాయుడి ఇంటిలో మాత్రం వేరే చర్చ జరుగుతోంది.  సారి ఎన్నికల్లో ఎంపీగా కాకుండా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అందుకు ఓ నియోజకవర్గాన్నీ ఖరారు చేసుకున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా టెక్కలితో దివంగత ఎర్రన్నాయుడు కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడు నుంచి.. ప్రస్తుతం అచ్చెన్నాయుడు వరకు ఆ నియోజకవర్గం ఆదరిస్తూనే ఉంది. ఒక్క టెక్కలి మాత్రమే కాదు.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కింజరాపు కుటుంబానికి అనుచరులు.. మద్దతుదారులు ఉన్నారు. ఈ కారణాల వల్లే ఆ కుటుంబం నుంచి ఎప్పుడూ ఒకరు ఎంపీగా ఉంటే.. మరొకరు ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. 

  ఇదీ చదవండి : తెలంగాణలో కలపాల్సిందేనంటున్నఆ గ్రామాల డిమాండ్ ఏంటి..? ఇప్పుడే సమస్య ఎందుకు వచ్చింది?

  తమ సామాజిక వర్గానికి బాగా పట్టున్న నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించారని తెలిసింది. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే రాజకీయంగా  బలమైన ముద్ర పడుతుందన్నది ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగడానికి అవకాశాలున్నాయన్నది వారి అభిప్రాయం. సమీకరణాలు కుదిరితే మంత్రిగానూ అవ్వొచ్చు. 2014 ఎన్నికలకు ముందు వరకు టీడీపీ కేడర్‌ అంతా రామ్మోహన్‌ చుట్టూ ఉండేది. ఆ ఎన్నికల్లో గెలిచి అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక అంతా అటు వైపు వెళ్లిపోయారని కుటుంబంలో చర్చ నడుస్తోందని భోగట్టా. అప్పటి నుంచి ద్వితీయ శ్రేణి నాయకుడిగానే రామ్మోహన్‌నాయుడును చూస్తున్నారని, అందుకే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.

  ఇదీ చదవండి : చిలుకూరు బాలాజీనే కాదు.. ఏపీలోనూ ప్రదక్షిణలతోనే కోర్కెలు తీరుస్తున్న హనుమంతుడు? ఎక్కడో తెలుసా?

  ప్రజల్లో బాగా పట్టున్న రామ్మోహన్‌నాయుడు ఒక వేళ ఎమ్మెల్యేగా బరిలో దిగితే.. అది పార్టీకి నష్టం కలిగిస్తుందని కొందరి వాదన. దీనికితోడు బాబాయ్‌ అచ్చెన్నాయుడు సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు. ఒకవేళ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా బరిలో దిగినా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరికి మంత్రి పదవి ఇస్తారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇది కాస్త గ్రూపు రాజకీయాలకు వేదిక అవుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు తెచ్చుకునేందుకు చంద్రబాబు సిద్ధం లేరని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kinjarapu Atchannaidu, Rammohan naidu, Srikakulam, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు