SRIKAKULAM GRAND MARRIAGE CELEBRATIONS BUT LOW BUDGET IN VIZIANAGARAM AGENCY WHAT IS SPECIAL NGS VZM
Different Marriage: అంగరంగ వైభవంగా పెళ్లి.. తక్కువ ఖర్చుతోనే.. ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు
గ్రాండ్ గా పెళ్లి అతి తక్కువ ఖర్చులోనే.. ఎలా సాధ్యమంటే?
Different Marriage: పెళ్లిళ్లు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అందులోనూ పెళ్లి మండపాన్ని ఘనంగా అలంకరించి.. గ్రాండ్ గా వేడుక చేయాలి అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని.. కానీ గిరిజనలు మాత్రం.. అతి తక్కువ ఖర్చుతో.. ఎలానో తెలుసా..?
Different Marriage: ఈ రోజుల్లో వివాహ వేడుక (Marriage Function) అంటే భారీగా ఖర్చు చేయాల్సిందే.. ఎందుకంటే పెళ్లి వేడుక అంటే సీరియల్ సెట్లు.. ఖరీదైన కళ్యాణ మండపాలు .. మండపం వెనుక భారీ సెట్టింగులు.. కూర్చునే అతిధులకు అందమైన కుర్చీలు వేయడం పరిపాటి. పెద్ద పెద్ద పందిళ్లు, అలంకరణలు, బంగారు ఆభరణాలు, పట్టు బట్టలు, వందల మంది చుట్టాలు, రకరకాల విందు భోజనాలతో పెళ్లిళ్లు.. ఇలా నగరాలు, పట్టణాలు, చిన్నచిన్న గ్రామాలలో కూడా చాలా ఘనంగా జరగడం చూస్తుంటాం.. ఇది ఎక్కడైనా కామన్.. కానీ విజయనగరం ఏజెన్సీ (Vizianagaram Agency) లోని గిరిజన గ్రామమైన ఎగువ మెండెంగిలో ఇందుకు భిన్నంగా వివాహాలు జరుగుతున్నాయి. అది కూడా చాలా గ్రాండ్ గా నే పెళ్లిళ్లు చేస్తారు.. కానీ అతి తక్కువ ఖర్చుతో.. ఎలా సాధ్యమవుతోందా తెలుసా..?
పార్వతీపురం మన్యం జిల్లా (Parvatipuram Manyam District) సాలూరు మండలం గిరిశిఖర గ్రామాలైన కొఠియా (Kotia) గ్రామాలలో చాలా తక్కువ ఖర్చుతో, చీరలతో పందిళ్లు, తోరణాలు కట్టి, ముస్తాబు చేసి పెళ్లిళ్లు జరుపుతున్నారు. కొఠియా గ్రామమైన ఎగువ మెండింగి గ్రామంలో ఇటీవల జరిగిన పెళ్లి (Marriage) లో ఇలాంటి వెరైటీ పెళ్లిలో, చీరలతో తయారు చేసిన పందిరిని వెరైటీగా ముస్తాబు చేసి, చీరలతోనే తోరణాలు కూడా కట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసారు.
గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక చీరను తీసుకు వచ్చి.. పందిరిని అందంగా అలంకరించారు. ఇక పెళ్లి జరిగే చోట పైకప్పును తాటాకులు లేదా కొబ్బరి మట్టలతో వేస్తారు. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇక పెళ్లి పందరి నుండి కొంత దూరం వరకూ, చుట్టూ చీరలతో అలంకరిస్తారు. మరికొన్ని చీరలను తోరణాలలా తయారు చేసి చుట్టూ కట్టిన చీరలకు అలంకరిస్తారు.
పిల్లలు, పెద్దలు, గ్రామంలోని మహిళలంతా కలిసి ఇలా ప్రతీ ఇంటి నుండి చీరలను పట్టుకొచ్చి, ఎక్కడైతే పెళ్లి చేస్తారో అక్కడికి చేరుకొని చీరలతో పందిరి వేసే పనిలో నిమగ్నమై.. చక్కగా సిద్దం చే్స్తారు. మొత్తానికి తక్కువ ఖర్చుతో గ్రామం అంతా కలిసి ఒక చోట చేరి తయారు చేసే పెళ్లి పందిళ్లలో పెళ్లిళ్లు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎగువ మెండెంగి గిరిజన గ్రామస్తులు
వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి.. కోట్లు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేసే పెళ్లిళ్లు చూస్తున్న ఈ రోజుల్లో ఇంకా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పెళ్లిళ్లు చేయడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.