Diwali 2022: దేశంలో హిందువులు అంతా ఆనందంగా జరుపుకునే పండగలలో దీపావళి (Diwali) ఒకటి.. ఇక చిన్నారులు.. టీనేజర్లు అయితే దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు.. బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లేలా చేస్తారు.. ఇక ప్రతి ఇంటి ఆవరణ దీపాలు.. విద్యుత్ అలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అయితే దీపావళి అంటే కేవలం బాంబుల మోతే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం (Lakshmi Devi Pooja) పొందాలి అనుకునే వారికి దీపావళి సరైన రోజు.. అంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి.. లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తుంటారు. అందుకే పండగ వస్తోందంటే ఊరూవాడా సందడే సందడి. సాధారణంగా వేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తాయి. సంస్కృతితో పాటు చరిత్రను కూడా గుర్తుకు తెచ్చే వేడుక దీపావళి.
అయితే ఇదే పేరుతో శ్రీకాకుళం జిల్లా (Srikakukam District) లో రెండు ఊళ్లు ఉన్నాయి. అందులో ఒకటి దీపావళి కాగా.. మరో ఊరు అయితే అసలు దీపాలే వెలిగించని గ్రామం.. మరి ఆ గ్రామం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిందే. అంతే కాదు.. దేశమంతా పండగ జరుపుకునే వేళ ఈ ఊరు మాత్రం దీపాలు వెలిగించకుండా అమావాస్య చీకటిలోనే గడిపేస్తుంది. ఆ చీకటి వెనుకా ఓ కథ దాగి ఉంది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో వందల ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. గ్రామంలో అందరూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఏ ఇంట్లోనూ దీపం వెలుగదు ఒక్క టపాసు కూడా పేలదు. స్వీట్ల మాటే వినిపించదు. ఇది ఆ ఊరి కట్టుబాటు. పున్ననపాలెంలో దీపావళిని జరుపుకోక పోవడానికి బలమైన కారణమే ఉంది. 200 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల ఆ గ్రామస్తులు దివ్వెల పండగకు దూరమయ్యారు. ఇంతకు ఆ ఘటన ఏమిటో తెలుసా..?
ఇదీ చదవండి : ఆ ఊరి పేరు దీపావళి.. ఎక్కడుంది.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే..?
పున్ననపాలెం గ్రామంలో 200 ఏళ్ల క్రితం దీపావళి, నాగులచవితి రోజున పాము కాటు వల్ల ఊయలలో ఓ చిన్నారని చనిపోయాడట. మరో రెండు ఎద్దులు కూడా మరణించాయి. ఆ రోజు నుంచి గ్రామంలో నాగుల చవితి, దీపావళి పండుగలు జరుపుకోకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
ఇదీ చదవండి : చంద్రబాబును అమిత్ షా లైట్ తీసుకున్నారా..? పొత్తులపై సిగ్నల్ ఇచ్చారా..?
ఆ కట్టుబాటును అందరూ ఇప్పటికీ పాటిస్తున్నారు. గ్రామంలో ఎంతో మంది చదువుకున్న వాళ్లు ఉన్నారు. మూఢనమ్మకాలను వదిలిపెట్టి.. దీపావళి పండుగను జరుపుకుందామని గ్రామ పెద్దలకు చెప్పినప్పటికీ.. వాళ్లు మాత్రం వినడం లేదు. ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించాల్సిందేనని చెబుతున్నారు. అది మూడాఛారమని పోలీసులు, ప్రభుత్వ అధికారులు, జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు చెప్పినా.. వినడం లేదు. ఇది సంప్రదాయమని, దాన్నే పాటిస్తామని అంటున్నారు. యువత మాత్రం దీపావళిని జరుపుకోవాలని కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Diwali, Diwali 2022, Srikakulam