హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Different Marriage: అక్కడ జంబలకడి పండ.. ఇది సినిమా కాదు నిజం.. కావాలంటే చూడండి ఏం జరుగుతోందో..?

Different Marriage: అక్కడ జంబలకడి పండ.. ఇది సినిమా కాదు నిజం.. కావాలంటే చూడండి ఏం జరుగుతోందో..?

వరుడి మెడలో వధువు తాళి

వరుడి మెడలో వధువు తాళి

Different Marriage: ఈ సీన్ చూస్తే.. నిజంగా జంబలకడి పంబ అనుకోవాల్సిందే.. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలోనే వీరి సంప్రదాయం ఉంది. వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం చూస్తే చాలామంది షాక్ అవుతారు.. కానీ వారికి ఇది అనాదిగా వస్తున్న ఆచారం.. అంతేకాదు.. ఇక్కడ పెళ్లిళ్లు చాలా ప్రత్యేకం కూడా..

ఇంకా చదవండి ...

Different Marriage: 1992 లో వచ్చిన జంబలకడి పంబ సినిమా (Jambalakadi Pamba Movie) సూపర్ హిట్ అయ్యింది. అయితే సినిమా కాన్సెప్టె ఏంటంటే.. ఆడవారు మగవారిలా..? మగవారు ఆడవారిలా వ్యవహరిస్తారు.. సాధారణంగా హిందువుల వివాహాలు (Hindu Marriages) అంటే.. వరుడు (Bride) వధువు (Bridegroom) మెడలో తాళి కడతాడు.. ఎక్కడైనా ఇదే సంప్రదాయం  ఉంటుంది. అందుకే అప్పటిలో సినిమా చూసివారంతా పడి పడి నవ్వుకుని హిట్ చేశారు.. అయితే సేమ్ అలాంటిదే నిజంగా ఇక్కడ జరుగుతోంది. వరుడి మెడలో వధువు తాళికట్టి వివాహం చేసుకుంటోంది. ఇది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనే..  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలోని ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. కేవలం అదొక్కటే కాదు.. ఇంకా ఎన్నో ఆచారాలు.. సంప్రదాలు ఉన్నావి వీరికి.. ఇక్కడ వివాహం అంటే కేవలం ఒక తంతు మాత్రం కాదు.. అదో పెద్ద పండుగే.. అది ఎప్పుడుపడితే అప్పుడు ఈ పెళ్లిల్లు జరపరు.. రెండేళ్లకు ఒకసారి మాత్రమే.. సామూహిక వివాహాలు జరుగుతాయి.

ఊళ్లలో ఒక ఇంట్లో పెళ్లంటేనే విపరీతమైన సందడి, హడావిడి ఉంటుంది. అలాంటిది ఊరుఊరంతా ఒకేసారి పెళ్లిళ్లంటే ఆ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పెళ్లిళ్ల పండగే.. నువ్వలరేవు గ్రామంలో జరిగింది. గ్రామం అంతా కలిసి ఏడాది కొకసారి చేసే సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి 10.11 నిమిషాలకు 47 జంటలు ఒక్కటయ్యాయి. రెండు మూడేళ్లకో ఒకసారి ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఎక్కడా లేని విధంగా నువ్వులరేవు గ్రామంలో వరుడు తలవంచితే.. వధువు కూడా మూడు ముళ్లు వేసింది.

ఇదీ చదవండి : వద్దని చెప్పినా వినడం లేదని.. అత్తని చంపిన కోడలు..? కారణం అదేనా..?

పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. మేళాలు.. అబ్బో! పెళ్లికి మూణ్నెల్ల ముందు నుంచి మొదలయ్యే సందడి.. మూడు రోజులపాటు జరిగే పెళ్లి సమయానికి మోతమోగిపోతుంది. ఇవే కాదు.. ఆ ఊరి పెళ్లిళ్లకు సంబంధించి మరిన్ని విశేషాలున్నాయి. నువ్వులరేవు అనే మత్స్యకార గ్రామంలో జరిగే పెళ్లిళ్ల కథే వేరు!! అక్కడ పెళ్లంటే.. ఊరంతా ఏకమైపోతుంది. ఊరే పెళ్లిపీటయిపోతుంది.  ఊరంతా పందిర్లు, విద్యుత్‌ కాంతులు విరజిమ్ముతాయి. మేళతాళాలతో వధూవరుల ఊరేగింపులు సాగుతాయి. ఈ గ్రామంలో ఉన్న ఆచార, సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేళ్ల కోసం సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 10.11 ముహూర్తానికి 47 జంటలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకుని, ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి.

ఇదీ చదవండి : బలవంతం కాదు, ఎఫైర్ లేదు.. సృజన బ్యాగ్ లో గన్నేరు పప్పు ఎక్కడిది..?

వధూవరులు ఇద్దరూ నువ్వలరేవు గ్రామస్థులే కావడంతో.. ఊరంతా పెళ్లి సందడి నెలకొంది. బంధువుల రాకతో పండగ వాతావరణం కనిపించింది. గ్రామ పెద్దల(బేహరాలు) సమక్షంలో వివాహాలు చేశారు. వధూవరులకు వదిన వరుసైన వారు దగ్గరుండి వేడుకలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం వరుడిని పెళ్లి దుస్తులతో అలంకరించాక పీటపై వరుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన కరెన్సీ నోట్ల మాలను ధరింప చేసారు. బంధువులు, స్నేహితులు నోట్లను తగిలిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం గ్రామ దేవత బృందావతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మట్టి కుండలకు పూజలు చేసి.. పెళ్లింటి వారికి గ్రామపెద్దలు అందించారు. సమీపంలో చెరువు నుంచి ఆ కుండలతో నీటిని తెచ్చి.. గ్రామంలో మిగిలిన దేవతలకు అభిషేకాలు చేశారు. వధువు కూడా తన కన్నఇంటి వారు పంచలోహాల పొడితో తయారు చేయించే దురుషం అనే చిన్న బంగారం వస్తువు వరుడు మెడలో కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ వేడుకలో. బంధువులతో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు ఈ సామూహిక వివాహాలు చూసేందుకు తరలివచ్చారు.

ఇదీ చదవండి : తెలంగాణ సీఎం కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారా..? మంత్రులకు అందుకే క్లాస్ పీకారా..?

పది వేలు జనాభా ఉండే నువ్వలరేవు మేజరు పంచాయతీ లక్ష్మీదేవిపేటగా పేరొందినా నువ్వలరేవుగానే ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామదేవత తులసి బృందావతి. తులసిమాతగా పూజిస్తారు. శ్రీరాముడు వారి ఇలవేల్పు. శ్రీరామనవమి వచ్చిందంటే సంబరాలు అంబరాన్నంటుతాయి. ఊళ్లో చాలా మంది డిగ్రీ చదివినవారు ఉన్నారు. అమ్మాయిలు కనీసం పదోతరగతి వరకు పూర్తి చేశారు. బి.టెక్‌లు చేసినవాళ్లు ఊళ్లొ 15 మంది వరకు ఉంటారు. డిప్లొమోలు చేసి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా ఈ ఊరి అమ్మాయినే వారు పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రేమ పేరుతో బయటి సంబంధాలు చేసుకోకూడదు. చేసుకుంటే గ్రామ బహిష్కరణే. నువ్వుల రేవు అమ్మాయి బయటి అబ్బాయిని చేసుకుంటే ఊళ్లో అడుగు పెట్టనివ్వరు. అమ్మాయి తల్లిదండ్రులకు, కుటుంబానికి ఏవిధంగానూ సహకరించరు. ఆ ఊరి అబ్బాయిలు బయటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నా గ్రామ బహిష్కరణ ఉంటుంది. కానీ, దానికో కాలపరిమితి కూడా ఉంటుంది. అబ్బాయి గామ్ర పెద్దల ముందు క్షమాపణ కోరితే శిక్ష తగ్గుతుంది. ఈ ఊళ్లో కట్నాల లాంటి మాటలే వినిపించవు.

First published:

ఉత్తమ కథలు