(Anand Mohan Pudipeddi,News18,Visakhapatnam)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంటికే రేషన్ బియ్యం(Ration Rice), ఫించన్‌లు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు, విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ..ఇప్పుడు మరో సేవను అందుబాటులోకి తెచ్చింది. కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్(Caraf Family Doctor) అనే కాన్సెప్ట్ ద్వారా ఇంటికే వైద్యసేవలందించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే వైద్య సేవలందించే సంచార వాహనాల్ని శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ప్రారంభించారు రెవెన్యూ శాఖా మంత్రి ధర్నాన ప్రసాదరావు(Dharnana Prasada Rao). వినూత్న పద్ధతికి కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని.. ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటి ఇంటికీ తిరిగి వైద్య సేవలు అందిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. చైతన్య వంతులైన ప్రజాప్రతినిధులు ఈ తరహా సేవలపై ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని.. ప్రభుత్వ వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందించడంలో అంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇంటికే ప్రభుత్వ వైద్య సేవలు ..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవలు ప్రజల గుమ్మంలోకి వచ్చాయి. మారిన పరిస్థితుల దృష్ట్య ప్రభుత్వం కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్‌తో సామాన్యుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విధమైన వైద్య సౌకర్యాల్ని కల్పించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో అందుబాటులోకి తెచ్చారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో సంచార వైద్యసేవలందించే వాహనాల్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అతి సామాన్య కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా, పేదల గుమ్మం దగ్గరకు వైద్య సేవలు అందించేవిధంగా ఈ సేవల అందిస్తారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో ఉండే ఇద్దరు డాక్టర్లు, రోజూ తమకు కేటాయించిన గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఇక దీర్ఘకాలిక రోగులకు నిరంతర మందులు, వైద్యసేవలు కూడా అందిస్తారని తెలిపారు.
నిరుపేదల కోసమే ..
అందరి ఆర్దిక పరిస్థితులు ఒకేలా ఉండవు. అందుకే కనీసం ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేని వాళ్లను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఉండే అతి సాధారణ కుటుంబాలకు వైద్యం అందించడంతో ఈ సంచార వైద్యశాలలను ప్రారంభించామన్నారు. ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బందులు పడటం, ప్రాణాలు కోల్పోవడం జరగకూడదనే మానవతా దృక్పథంతో ఈ సేవలు అందుబాటులో తెచ్చామన్నారు ధర్మాన ప్రసాదరావు. ఈ కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్ సంచార వైద్య వాహనాల్లో 14 రకాల రోగ నిర్థారణ పరీక్షలు అందుబాటులో ఉండనున్నాయి . రిఫర్ చేయాల్సి వస్తే సమీపంలోని పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు.
దేశంలోనే మొదటగా..
ఇలాంటి సేవను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు వైద్య సిబ్బంది అంతా కలిసి పనిచేయాలని కోరారు. అలానే గ్రామాల్లో ఉండే ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రైవేటు వైద్యంపై మక్కువ పెంచుకోవడం కంటే ఇలాంటి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
సేవలు ఉపయోగపడాలి..
మారిన పరిస్థితుల దృష్ట్యా సర్కారు వైద్యం ఇవాళ ఉన్నత ప్రమాణాలతో అందుతున్నాయి అనేందుకు ఎంతో కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలానే రిమ్స్ ఆస్పత్రికి 900 పడకలు ఏర్పాటుచేశామని, వైద్య, వైద్యేతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. చైతన్య వంతులైన ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాళ్లలో చైతన్యం తెచ్చి..కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి మీనాక్షి, ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ తులసి, గొండు రఘు, హాబీ బుల్లా ఖాన్, అందవరపు సంతోష్, 104 కోఆర్డినేటర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Ap government, Health benifits, Srikakulam