హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Crime News: బైక్ పై ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నారా? బీకేర్ ఫుల్.. ఈ సీన్ చూస్తే అమ్మో అనాల్సిందే?

AP Crime News: బైక్ పై ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నారా? బీకేర్ ఫుల్.. ఈ సీన్ చూస్తే అమ్మో అనాల్సిందే?

రూటు మార్చిన చైన్ స్నాచర్లు

రూటు మార్చిన చైన్ స్నాచర్లు

AP Crime News : ఆంధ్రప్రదేశ్ లో చైన్ స్నాచర్లు మళ్లీ భయపెడుతున్నారు. రోజుకూ ఎదో ఒక చోట రెచ్చిపోతున్నారు. అయితే పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం.. ప్రజలు అప్రమత్తం అవ్వడంతో ఈ సారి రూట్ మార్చాడు.. ఇప్పుడు ఏం టార్గెట్ చేస్తున్నారో తెలుాస?

ఇంకా చదవండి ...

Chin Snatchers:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చైన్ స్నాచర్లు (Chin Snatchers) మళ్లీ రెచ్చిపోతున్నారు. అయితే పోలీసులు గట్టి నిఘా పెట్టడం.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉండడం.. ప్రజల్లో కూడా అవగాహన పెరగడంతో చైన్ స్నాచర్ల జోరు తగ్గినట్టు కనిపించింది. కానీ మళ్లీ జనాలపై విరుచుకుపడుతున్నారు. రూటు మార్చి ప్రాయాణంలో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం (Srikakulam)లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం ఒక్కరోజే జిల్లాలో మూడుచోట్ల చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. పట్టపగలే నడిరోడ్డుపై బైక్‌పై వెళుతున్న మహిళల మెడలో చైన్ లాగేశారు. ఇప్పటి వరకు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడల్లో చైన్‌లు లాక్కెళ్లిన ఘటనలు మాత్రమే చూశాం.. కానీ ఇలా రన్నింగ్ బైక్‌‌ను కూడా వదలకుండా.. మహిళ మెడలో చైన్ లాక్కెళ్లడం కలకలం రేపింది. ఏమాత్రం పట్టుతప్పినా బైక్ పై ఉన్న మహిళ వెనక్కు పడితే.. పెద్ద ప్రమాదమే జరిగేది.

శ్రీకాకుళం కాకివీధికి (Kaki Veedhi) చెందిన బోగి లక్ష్మణరావు (Bhogdi Laxman Rao) తన భార్య రాధాకుమారితో కలిసి ద్విచక్ర వాహనంపై రామలక్ష్మణ జంక్షన్‌ వైపు  వెళ్తున్నాడు. లక్ష్మణ రావు వాహనం నడుపుతుండగా.. రాధాకుమారి వెనుక కూర్చుంది. సూర్యమహాల్ జంక్షన్ నుంచి పెద్దపాడు వెల్లే మార్గంలో సౌతిండియా షాపింగ్ మాల్ సమీపంలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను అక్కడే ఉండి ఇద్దరు దుండగులు గమనిస్తూ.. బైక్‌పై దారి కాచారు. సీసీ కెమెరాకు దొరక్కుండా తలకు హెల్మెట్లు ధరించారు. బైక్ వెనుక కూర్చున్న రాధాకుమారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యారు. ఆ సమయంలో వాహనాల రద్దీ, జనం రాకపోకలు అధికంగా ఉన్నా, వారు తప్పించుకొని వెళ్లిపోయారు.

ఇదీ చదవండి : నారాయణ బెయిల్ వెనుక అంత కథ ఉందా..? ఏపీపీని సస్పెండ్ చేసిన సర్కార్

స్థానికులు దుండగుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు.. కానీవారు పారిపోయారు. ఈ సీన్ మొత్తం ఆ సమీపంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనలో బాధితుల్ని శ్రీకాకుళం మేదర వీధికి చెందిన బోగి లక్ష్మణరావు దంపతులుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. చోరీకి గురైన బంగారు నల్లపూసలు, పుస్తెలతాడు కలిపి 6 తులాల ఉంటుందని బాధితులు వాపోయారు.

ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన ప్రకటన.. ఆ సీనియర్ నేతకు ఊహించని షాక్.. టీడీపీ తొలి అభ్యర్థి ఎవరంటే..?

ఇలాంటి మరొక ఘటన ఇచ్చాపురంలో చోటుచేసుకుంది. స్థానిక డైలీ మార్కెట్‌ జంక్షన్‌లో ఓ మహిళ మెడలోని రెండు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకొని పరారయ్యారు.  చీకటి బలరాంపురానికి చెందిన పైల సరస్వతి గురువారం ఉదయం మార్కెట్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఇంటి వెళ్లేందుకు బయటకు రాగా.. అక్కడే మాటువేసి ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును అపహరించారు. ఆమె కేకలు వేసినా.. దుండగుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సరస్వతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


ఇదీ చదవండి : బెల్లం కొనాలి అంటే ఆధార్ కార్డు ఉండాలా? విక్రయాలు సాగేదెలా అంటున్నవ్యాపారులు? ఆధార్ కార్డ్ ఎందుకో తెలుసా?

ఏజెన్సీ ప్రాంతమైన మెళియాపుట్టి మండలంలోని జరిభద్ర గ్రామంలో బంగారం ఆభరణాలకు మెరుగుపెడతామంటూ బంగారు నగలను లాక్కెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారం ఆభరణాలకు మెరుగుపెడతామని జర్రిభద్ర గ్రామానికి చెందిన  బెండి భాగ్యలక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించారు. దీంతో మెడలో బంగారం పుస్తెలతాడు తీసి చేతిలో పట్టుకునేలోపు ..2 తులాల బంగారం ఆభరణాన్ని పట్టుకుని దుండగులు పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బంగారు ఆభరణాలను లాక్కుని వాహనంపై టెక్కలిపట్నం వైపు పరారయ్యారని బాధితురాలు పేర్కొంది. స్ధానికులు కూడా దుండగుల కోసం వెతికినా అప్పటికే నిందితులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఒకే రోజు మూడు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరగడంతో ఈ కేసులను పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chain snatching, Crime news, Srikakulam

ఉత్తమ కథలు