హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Coco farming: ఉద్దానంలో మారుతున్న పరిస్థితి.. నష్టాల నుంచి లాభాల్లోకి రైతులు.. ఏం చేశారంటే?

Coco farming: ఉద్దానంలో మారుతున్న పరిస్థితి.. నష్టాల నుంచి లాభాల్లోకి రైతులు.. ఏం చేశారంటే?

రైతులకు లాభాలు అందిస్తున్న కోకో పంట

రైతులకు లాభాలు అందిస్తున్న కోకో పంట

Cocoa Farming: ఉద్దానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ నిత్యం కన్నీటి కథలే వింటూ ఉంటా.. కానీ ఇప్పుడు అక్కడి రైతులు కూడా ఆనందంగా ఉంటున్నారు. భారీగా లాభాలు సాధిస్తున్నారు. అందుకు ఏం చేశారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

వ్యవసాయం (Cultivation) అంటే చాలామందిలో సాధారణంగా ఉండే భావన నష్టాలు తప్పవని.. కానీ ప్రభుత్వం (Government) అందిస్తున్న ప్రోత్సకాలు.. వినూత్న ఆలోచనలు.. వ్యవసాయ అధికారులు  కల్పిస్తున్న అవగాహనతో పరిస్థితి మారుతోంది. నష్టాల్లో ఉండే పంటలు ఇప్పుడు లాభాల బాట పడుతున్నాయి. ఉద్దానం రైతులు (Farmers) ఏం చేశారంటే..? ఉద్దానం.. ఈ పేరు వింటే కొబ్బరి (Coconut) గుర్తుకు వస్తుంది. మరో కోనసీమ (Konaseema) గా దీనికి ఉత్తరాంధ్ర (North Andhra) లో పేరు. నిత్యం తుఫానులు వణికించే ప్రాంతం కూడా. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ఆరు మండలాల పరిధిలో ఉండే ఈ ఉద్యానవన పంటలు రైతులకు కల్పతరువుగా ఉంటాయి.

ఉద్దానంలో ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యమ్నాయ పంట అంటూ కోకో పంటను వేయమని అన్నదాతకు సూచించారు.. అందుకు సబంధించి మొక్కలు కూడా పంపిణీ చేశారు.  అయితే తమకు సరైన ప్రోత్సహాం ఇస్తే లాబాలు ఇంకా ఆర్జించవచ్చని అంటున్నారు. ఈ పంట  కారణంగా తాను ఇబ్బందులు లేకుండా కొబ్బరిలో అంతర పంటగా ఓసారి  కోతలో వేలాది రూపాయలు సంపాదిస్తున్నామంటున్నారు రైతులు..

సాధారణంగా శ్రీకాకుళం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఉద్దాన ప్రాంతం.. ఇది కోనసీమను తలపించే రీతిలో ఉంటుంది... ఇక్కడ ఒకప్పుడు కొబ్బరి. గత ఐదు సంవత్సరాల నుండి కొబ్బరి అన్నదాతకు అదుకోవడం లేదు. దీంతో  ప్రత్యమ్నాయ పంట వైపు అన్నదాత చూస్తున్న తరుణంలో క్యాడ్ బెరీ కంపెనీ వారు కోకో పంటపై అక్కడ అన్నదాతలకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి : తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్.. చిన్నపాటిది ఎగిరినా తెలిసేలా..?

దీని కారణంగా వచ్చే ఆదాయపు లెక్కలు చూస్తే..  కేజీకి 200 రూపాయలు వస్తుందని పెద్దగా ఖర్చు ఉండదంటున్నారు రైతులు.  ఇక ఈ పంటకు కష్టపడాల్సిన అవసరం లేదని ఆడుతూ పాడుతూ పనిచేయొచ్చని తెలిపారు. కొబ్బరి నుండి ఆదాయంతోపాటు ఈ పంట ఆదాయం కూడా సరిపోతుంది అంటున్నారు రైతులు..

ఇదీ చదవండి: వైభవంగా వసంత పంచమి వేడుకలు.. జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసాలు.. ప్రత్యేకత ఏంటంటే..?

ఇప్పటికైనా ప్రభుత్వం సరైన ప్రోత్సహం ఇస్తే.. వెస్ట్ గోదావరి కన్నా తాము అధికంగా పంటను పండిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటపై ఎవరైనా ఔత్సాహికులు వస్తే వారికి కూడా తాము ఉచితంగా నేర్పిస్తానని రైతు తెలిపారు.

ఇదీ చదవండి: చిన్నారి కాదు చిచ్చర పిడుగు.. జీనియస్ అనే పదం కూడా తక్కువే.. టాలెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక కేజీకి రెండు వందలు కంపెనీ ఇస్తుంది.. మాకు ట్రాన్స్ పోర్టు ఖర్చు 15 రూపాయలు అవుతోందని..  కేజీ దగ్గర తమకు 185 మిగులుతుందని అన్నదాతలు చెబుతున్నారు.  అన్ని ఖర్చులు పోను ఈ పంట అంతర పంటగా వేసినందుకు నాకు 40 నుండి 70 వేల వరకూ ఆదాయం వస్తోందని రైతు తెలిపారు. గతంలో 16 మంది రైతులు వేశామని కాని నేడు ముగ్గరు మాత్రమే మిగిలామని సరైన ప్రోత్సహం లేకపోవడమే కారణమని అంటున్నారు. అన్నదాతకు సరైన శిక్షణ నిస్తే వెస్ట్ గోదావరి కన్నా అధిక దిగుబడిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Farming, Srikakulam

ఉత్తమ కథలు