Home /News /andhra-pradesh /

SRIKAKULAM AP NEW DISTRICT PARAVATIPURAM COLLECTOR SUDDEN VISIT IN CITY AND ORDERS PASS TO CLEANING CITY NGS VZM

Collector: సైకిల్ మీద వచ్చి ప్రశ్నిస్తున్నారని లైట్ తీసుకున్నారు.. విషయం తెలిసి పరుగులు పెట్టారు?

సైకిల్ పై తనిఖీలు చేసిన కలెక్టర్

సైకిల్ పై తనిఖీలు చేసిన కలెక్టర్

  Collector Sudden Visit: ఇటీవల 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కొత్తగా కొలువు తీరింది. అందులోనూ కొన్ని కొత్త జిల్లాలకు (New Distircts) కొత్తగా వచ్చిన కలెక్టర్లు తమదైన మార్కు పాలనతో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam New District) కలెక్టర్ నిశాంత్ కుమార్ (Nisanth Kumar) తన మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇటీవలే పార్వతీపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన పట్టణ సుందరీకరణ, పారిశుద్యంపై దృష్టి పెట్టి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రం కొన్ని అంశాలలో ప్రత్యేకతతో ఉండాలని భావించి.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. తెల్లవారుజామునే సైకిల్ ఎక్కి తన బంగళా నుండి బయల్దేరిన కలెక్టర్ నిశాంత్ కుమార్ .. పట్టణంలోని ఆ చివర నుండి ఈ చివరి వరకూ తిరిగి.. పారిశుధ్యం మెరుగు కావాలని, మురుగు నీటి కాలువల ప్రవాహం బాగుండాలని, ప్లాస్టిక్ రహితంగా ఉంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. పట్టణంలోని రోడ్లమీదే విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులు, పందులు ఇక ముందు .. ఇష్టానుసారంగా సంచరించకుండా సుందర పట్టణంగా తయారు చేయాలని ఆదేశించారు.

  అయితే ఆయన సైకిల్ పై వెళ్లడంతో మొదట కొందరు సిబ్బంది గుర్తించక.. ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమధానాలు చెప్పలేదు. తరువాత అధికారులు రావడంతో అసలు విషయం తెలిసి అక్కడ నుంచి పరుగులు పెట్టాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా అధికారిక నివాసంలో ఉంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్.. సోమవారం తెల్లవారుజామునే.. మదిలో మెదిలిన వెంటనే తన సైకిల్ ఎక్కారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై సైకిల్ పై తిరుగుతూ.. ఎక్కడ అసౌకర్యంగా అనిపిస్తే అక్కడ ఆగి అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేసారు.

  ఇదీ చదవండి : ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో.. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అయనదే అన్న సజ్జల

  పట్టణం నడి బొడ్డు నుండి పొలిమేరల వరకు తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్యం, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి కాలువలు, మురుగు నీటి నిర్వహణ, రహదారుల పరిశుభ్రత, రహదారి డివైడర్లు, జాతీయ నాయకుల విగ్రహాలు, తాగు నీటి సరఫరా, క్రీడా మైదానం తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఆగి.. వివేకానంద విగ్రహాన్ని శుభ్రం చేయించి.. జాతీయ నాయకుల విగ్రహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని ఆదేశాలిచ్చారు.

  ఇదీ చదవండి :  పొత్తులపై యూటర్న్ తీసుకున్నారా..? చంద్రబాబు మాట్లకు అర్థం అదేనా..?

  మున్సిపాల్టీగా ఉన్న పార్వతీపురం పట్టణంలో గత కొన్నేళ్లుగా అనేక సమస్యలు ఉన్నాయి. ఎక్కడికక్కడ పాడైపోయిన రోడ్లు, కాలువలు, చెత్తకుప్పలు దర్శనమిచ్చేవి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పారిశుద్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాగా, ఇటీవల జిల్లాల పునర్విభజన లో జిల్లా కేంద్రంగా మారిన పార్వతీపురం పట్టణంలో పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. కొద్దో గొప్పో చేస్తున్నా... ఇంకా జిల్లా కేంద్రం మారాలని భావించిన జిల్లా  కలెక్టర్ నిశాంత్ కుమార్.. వెంటనే రంగంలోకి దిగారు.

  ఇదీ చదవండి : ఏపీలో మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? టీడీపీ -జనసేన పొత్తు ఫిక్స్ అయితే బీజేపీ స్టాండ్ ఏంటి?

  రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో నీరు నిలువ కుండా నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి డివైడర్లకు రంగులు వేయాలని, రహదారులను శుభ్రంగా ఉంచాలని,  పశువుల యజమానులకు అవగాహన కల్పించాలని, అప్పటికి నియంత్రణ లేకపోతే గోశాల వంటి ప్రదేశంలో ఉంచాలని ఆయన అన్నారు. దుకాణదారులు చెత్తను రహదారిపైకి వేయరాదని, డస్ట్ బిన్ లను పెట్టు కోవాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలో మంచి వాకింగ్ ట్రాక్ ఉండాలని సూచించారు. అందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న ట్రాక్ కు మరిన్ని హంగులు చేకూర్చి మెరుగు పరచాలని అన్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP new districts, AP News, Collector, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు