Speaker: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్పీకర్ తమ్మినేని సీతారం (Tammineni Seetaram) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ.. వివాదాల్లో నిలిచారు.. స్పీకర్ గా అందరి గౌరవం పొందాల్సిన బాధ్యత తమ్మినేనిపై ఉందని.. కానీ ఆయన స్పీకర్ లా కాకుండా.. ఓ సాధారణ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారంటూ పలుసార్లు విపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు ఆయన వ్యాఖ్యలు సైతం పలుమార్లు వివాదాస్పదమం అయ్యాయి. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. వైసీపీ (YCP) లో చేరిన తరువాత తమ్మినేని సీతారాం.. సీఎం జగన్ (CM Jagan) కి వీరవిధేయుడిగా ముద్ర వేసుకున్నారు. అంతేకాదు జగన్ పై ఈగ వాలినా సహించరు. ఎవరైనా జగన్ ను విమర్శిస్తే ఓ రేంజ్ లో వారిపై విరుచుకుపడతారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పైనే అదే స్థాయిలో విమర్శలు చేయడంలో ముందు ఉంటారు.. ఇప్పుడుమరోసారి విపక్షాల తీరుపై తీవ్రంగా స్పందించిన ఆయన తొడకొట్టి మరి ఛాలెంజ్ చేశారు.
ఏపీ స్పీకర్ గా ఉన్న సీతారాం ఇవాళ తనలోని మరో రూపం చూపించారు. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలొ నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో తొడగొట్టారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి సిఎం అవుతారని.. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా అంటూ తొడకొట్టి సవాల్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మహిళలే దీనిపై భరోసా ఇస్తున్నారన్నారు. విభిన్నమయిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలలోకి వెళుతున్న సిఎం జగన్ పై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరుస్తుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గడప గడప వైసీపీ నేతలు వెళ్తుంటే మహిళలు ఘనంగా స్వాగతం చెబుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నా.. విపక్షాలు విమర్శలు చేయడం దారుణహన్నారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే ఇలా విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని.. ప్రజలు ఎవరూ వారి మాటలను నమ్మే అవకాశం లేదన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. మళ్లీ సీఎం అయ్యేది జగనే అంటూ ఇలా తొడకొట్టారు.
ఇదీ చదవండి : వైసీపీపై మనసులో మాట బయటపెట్టిన మెగాస్టార్.. ఫంక్షన్లకు పిలుస్తుంటే అలా ఫీలవుతానని వివరణ
ఏపీలో మూడున్నరేళ్లుగా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయన్నారు. ఏ ఇంటికి వెళ్లినా పథకాల గురించే మాట్లాడుతున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డే అన్నారు. పథకాల గురించి విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామంటున్నారు జగన్. ఇప్పుడు స్పీకర్ తమ్మినేని కూడా అదే మాట చెబుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా జనం మళ్లీ జగన్ కే పట్టం కడతారంటున్నారు. అయితే, స్పీకర్ అయి ఉండి తమ్మినేని ఇలా ప్రవర్తించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Speaker Tammineni Seetharam, Srikakulam, Ycp