హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Brave Girl: పరీక్ష కోసం ఇంత సాహసమా..? ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటిన యువతి

Brave Girl: పరీక్ష కోసం ఇంత సాహసమా..? ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటిన యువతి

పరీక్ష రాసేందుకు ఇంత సహాసమే..?

పరీక్ష రాసేందుకు ఇంత సహాసమే..?

Brave Girl: ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు అమ్మాయిల తీరు చదువుపై వారికి ఉన్న మమకారం ఏంటో తెలిసేలా చేశాయి. ఓ యువతి అయితే.. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నది దాటి మరీ పరీక్ష రాసి.. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంది. ఇదే సమయంలో మరో యువతి.. మూడు మార్కులు తక్కువ వచ్చాయని.. ఆత్మహత్యకు పాల్పడింది.. రెండు ఘటనలు ఒకే ప్రాంతంలో చోటు చేసుకున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Brave Girl: నేటి విద్యార్థుల్లో చాలామంది పరీక్షలు (Exams) అంటే భయపడతారు.. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలా అని పథకాలు కూడా వేస్తారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. షాక్ గా చూపించి.. పరీక్షల నుంచి తప్పించుకుంటారు.. కానీ ఈ యువతి మాత్రం అందుకు భిన్నం.. ఆమె చేసిన సాహసం చూసిన ఎవరైనా.. అమ్మో ఇంత ధైర్యమా.. హ్యాట్సాఫ్ అనాల్సిందే.. ఎందుకంటే భారీ వర్షాల వ‌ల్ల చంపావతి నదిలో నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో మ‌ర్రి వ‌ల‌స గ్రామానికి బయటి ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఓ యువతి పరీక్షకు హాజరయ్యేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద సాహసమే (Daring) చేసింది. 21 ఏళ్ల ఆ యువతి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని దాటి తన గమ్యస్థానాన్ని చేరుకుంది.

  తన ఇద్దరు సోదరుల సహాయంతో నిండుకుండాలా ప్రవహిస్తున్న నది దాటింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. చంపావతి నదిలో ఈదుకుంటూ వెళ్లిన ఆ యువతికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

  స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రి వలస గ్రామానికి చెందిన తాడ్డి కళావతి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. సరిగ్గా రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శనివారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారమే ఇంటి నుంచి ప్ర‌యాణం ప్రారంభించాల‌నుకున్నారు. కానీ, భారీ వర్షాల వ‌ల్ల చంపావతి నదిలో నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో మ‌ర్రి వ‌ల‌స గ్రామానికి బయటి ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయాయి.

  ఇదీ చదవండి : మహిళకు జగన్ సర్కార్ మరో ఆఫర్.. ఆ ఫథకానికి దరఖాస్తు చేసుకోడానికి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే?

  ఏం చేయాలో పాలు పోని స్థితిలో ఉన్న క‌ళావ‌తికి ఆమె ఇద్దరు సోదరులు సాయం చేశారు. ఆమెతో పరీక్ష రాయించేందుకు గానూ కళావతి ఇద్ద‌రు సోద‌రులు ఆమెను ఎలాగైనా న‌దిని దాటించాల‌ని అనుకున్నారు. వారి సహాయంతో పట్టుదలగా ఆమె నది దాటి పరిక్ష రాసింది. ఇలా ఆమె చేసిన సాహసం చూసినవారంతా హ్యాట్సఫ్ అంటున్నారు.

  ఇదీ చదవండి: సీపీఐ నారాయణకు నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్.. బిగ్ బాస్ వేదికపైనే ఏమన్నారంటే?

  మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన మరో విద్యార్థి పరీక్షల పేరుతో ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకులం జిల్లా పాతపట్నంలో ఓ యువతి.. తన నాన్నకు డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. 27 ఏళ్ల యువతి సారా నేపాలి ఆత్మహత్యకు కారణం ఏంటంటే.. మూడు మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపం చెందింది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ పరీక్షల కీ విడుదల చేసింది. అయితే సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని.. అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది అని కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు