హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Exclusion: ఆ గ్రామం నుంచి రజకుల బహిష్కరణ.. ఇతర కులాల సహాయ నిరాకరణకు ఇదే కారణం

Exclusion: ఆ గ్రామం నుంచి రజకుల బహిష్కరణ.. ఇతర కులాల సహాయ నిరాకరణకు ఇదే కారణం

రజకుల గ్రామ బహిష్కరణ

రజకుల గ్రామ బహిష్కరణ

Exclusion: సమాజం ఎంతో ముందుకు వెళ్తోంది.. టెక్నాలజీ పరంగం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న రోజులు ఇవి.. అయినా ఇప్పటికే కట్టుబాట్ల పేరుతో కుల బహిష్కరణలు.. గ్రామ బహిష్కరణలు ఆగడం లేదు. ఓ గ్రామంలో రజకులను ఇతర కులాల వారు బహిష్కరించారు.. మరి ఈ సహాయ నిరాకరణకు కారణం ఏంటో తెలుసా?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Srikakulam, India

  Exclusion: పచ్చని చెట్లు.. మనసను హత్తుకునే వాతావరణం.. చల్లని పైరుగాలితో ఆ గ్రామం.. నిత్యం ప్రశాంతంగా.. ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని బాతువ గ్రామం గురించే ఇది.. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామ జనాభా దాదాపు నాలుగు వేలు ఉంటుంది. ఇందులో 40 కుటుంబాలకు పైగా అంటే దాదాపు 200 మంది రజకుల జనాభా ఉంది. అయితే గ్రామంలో నివాసం ఉంటోంది మాత్రం వంద మందిలోపే. ఇక్కడ అధిక సంఖ్యలో రజకులు.. బీసీలు, ఎస్సీలతో పాటు ఇతర కులాల వారు ఉన్నారు. ఇక్కడ ఓ వివాదం ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఇష్యూగా మారుతోంది. ఎందుకంటే రజకులు ఆందోళన బాట పట్టారు.

  వారి ఆందోళనకు ప్రాన కారణం.. ఇతర కులాలవారు తమకు పాలు, మందులు, బియ్యం అమ్మడం లేదంటూ శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. అయితే అందుకు కారణం.. గ్రామంలోని కట్లుబాట్లు, ఆచారం ప్రకారం రజకులకు ఏటా గ్రామస్థులు ఎవరి స్తోమత బట్టి వారు బియ్యం, ధనం ఇస్తుంటారు. అయితే ఇవి తమకు సరిపోవడం లేదని ఎక్కువ కావాలని రజకులు అడిగారు. అయితే అందుకు ఇతర కులస్తులు అంగీకరించలేదు.

  ప్రస్తుతం గ్రామంలో ఉన్న రజక కుంబాల వారు.. తమ పిల్లల చదువుల కోసం బాతువ వదిలి విశాఖపట్నం .. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ కేవలం రజకుల ఇళ్లల్లో వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. అయితే వారు బట్టలు ఉతికే పరిస్థితుల్లో లేరు. అయినా బట్టలు ఉతకాలని డిమాండ్ చేస్తున్నారని రజక సంఘాలు చెబుతున్నాయి.. కానీ తాము ఎక్కవ డబ్బులు డిమాండ్ చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

  ఇదీ చదవండి : నేరుగా భక్తులకే స్వామి సేవ చేసే అవకాశం.. ఈ నెల 11 నుండి శ్రీ వేంక‌టేశ్వర వైభ‌వోత్సవాలు..

  బట్టలు ఉతక్కపోవడం అనేది రజకుల ఇష్టం. ఉతకం అని అన్నందుకు గ్రామస్థులంతా కలిసి సహాయ నిరాకరణ చేయడం కరెక్టు కాదని రజక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బట్టలు ఉతకనంత మాత్రాన గ్రామ బహిష్కరణ చేయడం ఏంటని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక సంఘాల పెద్దలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ గ్రామ ఆచారాల ప్రకారం డబ్బులు ఇవ్వాలని అడగడం, వాటిపై ఇతరులు అంత ఇవ్వలేం అని అనడం, ఎంతో కొంతకు మాట్లాడడం చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. కానీ ఈ జనవరి నుంచి చిన్నపాటి చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు.. రజకులను ఉద్దేశించి ఏం చేయలేరు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంతో వివాదం పెద్దది అయ్యింది.

  ఇదీ చదవండి : 50 ఏళ్లు కష్టపడి సంపాదించారు.. జీజీహెచ్ కు యావదాస్థి రాసిచ్చిన వైద్యురాలు.. ఎంతో తెలిస్తే షాక్

  దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతూ వచ్చింది. మాటలతో సద్దుమణిగోవాల్సిన వివాదం ఇప్పుడు పెద్దదిగా అయ్యింది. కొందరు రెచ్చగొట్టే విధంగా వీడియోలు పెట్టడమే దీనికి కారణం అంటున్నారు. అయితే రజకులు మాత్రం.. తమ పిల్లలకు పాలు కావాలన్నా, మందులు కావాలన్నా అమ్మడం లేదని... పైగా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. బట్టలు ఉతకబోమని, శవ దహనాలు చేయబోమని రజకులు అంటున్నారు, వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం, అలాగే మేం వారికి ఏ పనుల్లో సహాయం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం, మా నిర్ణయాన్ని వారు గౌరవించాలి అని గ్రామంలో కొందరు చెబుతుంటే.. కిరాణ వ్యాపారస్తుల వెర్షన్ వేరేలా ఉంది. సరకులు అమ్మితే 5 వేలు అపరాధ రుసుం విధిస్తున్నారనే మాట అబద్ధమని.. గతంలో చెల్లించినట్లుగానే వారికి ఏడాదికి బియ్యం, డబ్బులు ఇస్తున్నామని ఇతర గ్రామ పెద్దలు చెబుతున్నారు. కేవలం గతంలో లా అంతా ఐకమత్యంగా పోదామని చెబుతున్నా రజకులు మాత్రం తాము బట్టలు ఉతికేది లేదని మొండికేస్తూ.. తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని వారు చెబుతున్నారు.

  ఇదీ చదవండి : మీరు మారిపోయారు.. అవును నిజమే.. ఆయన ఈయనేనా అంటూ ఆశ్చర్యం

  రజకులు వాదన వేరేలా ఉంది.ఈ నెల 3వ తేదీ సాయంత్రం గ్రామంలో దండోరా వేశారని... రజకులు బట్టలు ఉతకడం లేదు కాబట్టి, వారికి ఎవరు సహాయం అందించవద్దంటూ దండోరా వేశారని.. అందుకే మేం ఆందోళనకు దిగాల్సి వస్తోంది అంటున్నారు. తమకు నిత్యావసర సరకులు అమ్మబోమనడం సరికాదని రజకులు అంటున్నారు.

  ఇదీ చదవండి : 50 ఏళ్లు కష్టపడి సంపాదించారు.. జీజీహెచ్ కు యావదాస్థి రాసిచ్చిన వైద్యురాలు.. ఎంతో తెలిస్తే షాక్

  రజకుల ఆందోళనల వల్ల గ్రామం పేరు చెడిపోయిందని, అందుకు రజకులు క్షమాపణ చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామస్థులంతా గ్రామంలోని గుడి వద్దకు చేరుకున్నారు. మీ బట్టలు మేం ఉతకం అని గ్రామంలోని రజకులు అంటే గ్రామంలోని మిగతా కులాల ప్రజలు వీరికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. - ఇది శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామంలో నడుస్తున్న వివాదం. ఈ వివాదం తీవ్రమై మూడు రోజులుగా ఉద్రిక్తతకు దారి తీయడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Village

  ఉత్తమ కథలు