SRIKAKULAM ANDHRA PRADESH CRIME NEWS WIFE KILLED HER HUSBAND SHE WANT CONTINUE WITG BOY FRIEND RELATION NGS VZM
Extramarital Affair: ఆ పని చేయొద్దని మందలించడమే భర్త తప్పా..? ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్? తల్లి కూడా సహకరించడం దారుణం
ప్రతీకాత్మక చిత్రం
AP Crime News: అక్రమ సంబంధాలు ఎంతపనైనా చేయిస్తున్నాయి. క్షణకాలం సుఖం కోసం కొందరు అందమైన తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. పాడు పని చేయొద్దని ఓ భర్త మందలించాడని.. ఆ భార్య ఏం చేసిందో తెలుసా..?
AP Crime News: అక్రమ సంబంధాలు (Extramarital Affair) పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా భావిస్తూ.. పరాయి వారితో చనువు పెంచుకుంటున్నారు. ఆ పరిచయం తరువాత అక్రమ సంబంధంగా మారుతోంది. ఆ మోజులో పడి సంసారాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్న సంఘటను ఎన్నో పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో తిరగొద్దన్నందుకు.. భర్త (Husband)ను కడతేర్చింది ఓ భార్య (Wife).. వెనుక నుండి రాడ్డుతో కొట్టడంతో భర్త ఆయన డెడ్ బాడీని రైల్వే ట్రాక్ పై పడేసి.. అతడే రైలు కింద పడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే భర్త తరపు కుటుంబ సభ్యులకు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవాలు తెలిసిన తరువాత పోలీసులు సైతం షాక్ ఇవ్వాల్సి వచ్చింది.
పోలీసులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గాదివానివలస గ్రామానికి చెందిన 38 ఏళ్ల అట్టాడ చంద్రశేఖర్ మిమ్స్ ఆసుపత్రిలో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందన్న కారణంతో.. నెల్లిమర్ల యాదవ వీధిలోని ఓ ఇంట్లో కొన్నేళ్ల క్రితం దిగారు. ఆ క్రమంలో ఇంటి ఓనర్ అయిన కిలాన సూరి రెండో కుమారుడు అయిన కిలాన రాంబాబుకు, చంద్రశేఖర్ భార్య అరుణజ్యోతితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త అరుణజ్యోతిని ప్రశ్నించేవాడు. కొన్నాళ్లకు భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకొని.. అక్కడి నుండి ఇంటిని ఖాళీ చేసి, మరో ప్రాంతానికి మారిపోయాడు.
ఇళ్లు మారిన తరువాత రాంబాబుతో ఉన్న అక్రమ సంబంధాన్ని మాత్రం బార్య అరుణ జ్యోతి వదల్లేదు. ఏకంగా ఇంటిలోనే వారి భాగోతం మొదలు పెట్టారు. భర్త చంద్రశేఖర్ కి విషయం తెలిసి.. ఆమెతో గొడవకు దిగాడు. పలుమార్లు భార్య చేస్తున్నది తప్పని చెప్పడానికి ప్రయత్నించాడు. పిల్లలు ఎదుగుతున్నారని, వారికి ఈ విషయం తెలిస్తే బాగోదని వివరంగా చెప్పాడు. ఇప్పటికైనా వివాహేతర సంబంధాన్ని ఆపాలని కోరాడు.
అప్పటికే ప్రియుడి మోజులో పూర్తిగా మునిగిపోయిన భార్య అరుణ.. భర్తను వదిలేయాలని ప్రియుడి వద్దకు వెళ్లిపోవాలని డిసైడ్ అయింది. దీంతో ఆమె ఏకంగా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో హత్యకు పన్నాగం పన్నింది. కిరాయి హంతకులను చూడాలని రాంబాబుకు చెప్పింది. దీంతో రాంబాబు స్నేహితుడైన ఎర్రంశెట్టి సతీష్‌ను సంప్రదించి హత్యకు ప్రణాళిక రచించారు. కిరాయి 40 వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. అరుణజ్యోతి తల్లి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటరాపురంలో ఉంటున్న శంబాన సత్యవతి కూడా అల్లుడుని హతమార్చేందుకు 20 వేల రూపాయలు సమకూర్చింది.
వారంతా వేసుకున్న పథకం ప్రకారం గత నెల 25న చంద్రశేఖర్‌ను పార్టీకి పిలిచారు. రైల్వే ట్రాక్ సమీపానికి రమ్మన్నారు. నిజమేనని భావించిన భర్త చంద్రశేఖర్.. అక్కడికి వచ్చాక రాడ్డుతో వెనుకనుండి తలపై కొట్టడం, కత్తులతో పొడిచి చంపేశారు. భర్త శవాన్ని రైలు పట్టాలపై పడేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులను, స్ధానికులను నమ్మించారు.
అయితే అమె ప్రవర్తనపై అనుమానం రావడంతో.. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. భార్య వైఖరిపై అనుమానంతో విచారణ చేశారు. భర్త చంద్రశేఖర్ దగ్గర ఫోన్ లభ్యం కావడంతో వాటికి వచ్చిన కాల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. విషయం తెలుసుకున్న తర్వాత భార్య అరుణజ్యోతిని లోతుగా విచారించగా ఆమె నేరం అంగీకరించింది. కేసులో సూత్రధారులైన రాంబాబు, సతీష్, సత్తెమ్మలను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ మంగవేణి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.