SRIKAKULAM ANDHRA PRADESH CRIME NEWS TWO KIDS KIDNAPPED AND IN 24 HOURS POLICE CHASE THE KIDNAP CASE NGS VZM
AP Crime: పిల్లల కోసం భారీ స్కెచ్.. తల్లిదండ్రులతో పరిచయం.. తరువాత కిడ్నాప్.. కానీ ఇలా దొరికిపోయింది
కిడ్నాపర్ లను పట్టించిన కారు నెంబర్
Kindaap: ఆంధ్రప్రదేశ్ లో నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే.. ఆ కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు.. ఎలా అంటే..?
AP Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కిడ్నాప్ కలకలం రేపింది.. కానీ పోలీసులు చాకచక్యంగా కిడ్నాప్ ను చేధించారు.. ఏం జరిగిందంటే..? విజయనగరం జిల్లా (Vizianagaram District) బాడంగి మండలం (Badangi Mandal) డొంకిన వలస (Donkina Valasa)కు చెందిన కామేశ్వరరావు (Kameswara Rao), ప్రియాంక (Priyaka)ల ఎనిమిది నెలల అబ్బాయి రాజేటి ధన్విత్ (Rajeti Dhanvith) , ఈశ్వర రావు (Eswar Rao) సరోజిని (Sarojani) లకు చెందిన కూతురు 11 ఏళ్ల సుస్మిత (Sushmitha)లు డొంకినవలస లోని వారి ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. ధన్విత్ వాళ్ల అమ్మమ్మకు గత కొద్ది రోజులు క్రితం విజయవాడ (Vijayawada)లో కిడ్నాపర్ గుగ్గిలాపు శోభ (Guggurala Sobha) అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయంతో కొద్ది రోజుల క్రితం డొంకినవలసకు చుట్టరికానికి వచ్చిన కిడ్నాపర్ శోభ మూడు రోజులు ఉండి మళ్లీ వెళ్లిపోయింది. మళ్లీ రెండు రోజుల క్రితం డొంకిన వలసలోని ధన్విత్ అమ్మమ్మ ఇంటికి వచ్చిన కిడ్నాపర్ శోభ.. అందరితో సరదాగా గడిపి శనివారం ఇంటిలో అందరితో కలిసి విజయనగరం షాపింగ్ కు కూడా వచ్చింది. ఇక ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో 8 నెలల ధన్విత్ ను ఎత్తుకొని ఇంటి దగ్గర ఆడుకుంటున్న సుస్మిత, ధన్విత్ లను శోభ కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారమే ఉదయమే విజయనగరం వెళ్లాలని బాడుగకు కారును తెప్పించుకుంది. 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద పిల్లలకు కూల్ డ్రింకులు కొని ఇస్తానని మాయమాటలు చెప్పి కారు ఎక్కించుకుంది.
పరిచయం ఉన్న ఆమే కావడంతో.. పిల్లలు కాదనకుండా కారు ఎక్కారు. వారు కారు ఎక్కిన తరువాత పాలకొండకు వెళ్లాలని చెప్పింది. అయితే ఇవేమీ తెలియని కారు డ్రైవర్.. పిల్లలు ఎవరిని అడగగా, తాను తన భర్తతో విబేధాలు ఉన్నాయని, వీరిద్దరూ తమ పిల్లలేనంటూ మాయమాటలు చెప్పి.. ఇద్దరు పిల్లలను కారులోకి ఎక్కించి.. డ్రైవర్ ను పాలకొండ వైపు వెళ్లాలని చెప్పింది. దీంతో కారు డ్రైవర్.. తన కారును డొంకిన వలస నుండి రాజాం మీదుగా పాలకొండ వైపు వెళ్తున్నాడు.
సుమారు ఒంటి గంట సమయంలో తమ పిల్లలు కనిపించడం లేదని చూసుకున్న తల్లిదండ్రులు.. చుట్టుపక్కల వెతికారు. కానీ ఫలితం లేకపోవడంతో.. వెంటనే 2 గంటల సమయంలో బాడంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అసలు ఏం జరిగింది అని పోలీసులు అడగారు.. వేరే వ్యక్తి ఎవరైనా పిల్లలతో ఉన్నారా అని అడగగా.. శోభ గురించి చెప్పారు. దీంతో ఆమె కనిపించడం లేదు.. కారు కూడా లేదని చెప్పడంతో.. ఆమె కారు నెంబరు ఆధారంగా రాజాం సమీపంలోని కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అందులో ఉన్న నిందితురాలు శోభ అనే మహిళను అదుపులోకి తీసుకుని, పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. అయితే ..కిడ్నాపర్ శోభ .. ఈ పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందన్న విషయం ఇంకా బయటకు రాలేదని, పిల్లలను ఏమి చేయాలని కిడ్పాపర్ భావించిందన్న దానిపై ఇంకా నిందితురాలిని విచారించాల్సి ఉందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని.. బొబ్బిలి డీఎస్పీ మోహనరావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.